INDW vs SLW : వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం తగ్గిన తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ముగ్గురు కీలక బ్యాటర్లు ఒకే ఓవర్లో పెవిలియన్ చేరారు. అర్ధ శతకానికి చేరువైన హర్లీన్ డియోల్(48)ను ఔట్ చేసిన ఇనొకా రణవీర తర్వాతి బంతికే జెమీమా రోడ్రిగ్స్(0) ను క్లీన్ బౌల్డ్ చేసింది. దాంతో.. హ్యాట్రిక్‌పై నిలిచింది. కానీ, దీప్తి శర్మ(7 నాటౌట్) వికెట్‌ను కాపాడుకుంది.
కానీ, సింగిల్ రాగా క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (21) కట్ షాట్ ఆడబోయి వికెట్ కీపర్ సంజీవని చేతికి చిక్కింది. దాంతో.. 120-3తో పటిష్టంగా ఉన్న టీమిండియా ఒక్కసారిగా 124-5 కు చేరింది. మరసటి ఓవర్లో రీచా ఘోష్(2) సైతం డియోల్ మాదిరిగానే కవర్స్‌లో ఆడబోయి చేతికి క్యాచ్ ఇచ్చింది. అంతే.. చూస్తుండగానే ఆరు వికెట్లు పడ్డాయి. టెయిలెండర్లతో కలిసి దీప్తి శర్మ జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందిస్తుందా? లేదా? చూడాలి. 28 ఓవర్లకు స్కోర్.. 125-6
এক ওভারেই ৩ উইকেট নিলেন ইনোকা#WWC2025 #InokaRanaweera #INDvSL pic.twitter.com/P99iG5dc2M
— Cricfrenzy.com (@Cricfrenzylive) September 30, 2025