ఐపీఎల్ 14వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మరో అద్భుత విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన రాజస్థాన్ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుచేసింది. కొత్త కెప్టెన్ కేన్ విలియమ్సన్ సారథ్యంలోని రైజర్స్ ఆటతీరులో ఎలాంటి మార్పు లేకపోవడంతో మరోసారి ఓటమి తప్పలేదు.
221 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులే చేసింది. సమిష్టిగా రాణించడంలో రైజర్స్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. మనీశ్ పాండే(31), జానీ బెయిర్‌స్టో(30), కేన్ విలియమ్సన్(20), విజయ్ శంకర్(8), కేదార్ జాదవ్(19) ఏ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహమాన్, క్రిస్‌మోరీస్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు జోస్ బట్లర్(124: 64 బంతుల్లో 11ఫోర్లు, 8సిక్సర్లు) అద్భుత శతకానికి తోడు సంజూ శాంసన్(48: 33 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్(12), రియాన్ పరాగ్(15 నాటౌట్), డేవిడ్ మిల్లర్(7 నాటౌట్) బ్యాటింగ్‌కు వచ్చారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరి బ్యాటింగే హైలెట్. వీరిద్దరూ రెండో వికెట్‌కు 150(81 బంతుల్లో) పరుగులు జోడించారు.
All Over: Riding on a dominant batting show, @rajasthanroyals register a comfortable 55-run victory against #SRH. They pick up 2 points and also improve their NRR. https://t.co/7vPWWkMqQ2 #RRvSRH #VIVOIPL pic.twitter.com/9KGITuwByd
— IndianPremierLeague (@IPL) May 2, 2021