IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పంతొమ్మిదో సీజన్ రిటెన్షన్, వేలం తేదీలు సమీపిస్తున్నాయి. ఆక్షన్ లోపే ట్రేడ్ పద్ధతిన ఆటగాళ్లను మార్చుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. పద్దెనిమిదో సీజన్ ముగిసినప్పటి నుంచి ప్రధానంగా సంజూ శాంసన్ (Sanju Samson) గురించే చర్చ నడుస్తోంది. తనను వచ్చే సీజన్‌కు రీటైన్ చేసుకోవద్దని సంజూ చెప్పడంతో అతడిని ఇచ్చేసి మరొకరిని తీసుకునేందుకు జస్థాన్ రాయల్స్ యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఎంఎస్ ధోనీ వారసుడిగా సరైన కెప్టెన్ వేటలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. ట్రేడ్ డీల్‌కు రెఢీగా ఉన్న ఈ రెండు ఫ్రాంచైజీల మధ్య ఇటీవలే ప్రాథమిక చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
గత నాలుగేళ్లుగా సారథిగా వ్యవహరిస్తున్న శాంసన్‌కు రాజస్థాన్ రాయల్స్ పద్దెనిమిదో సీజన్లో రూ.18 కోట్లు చెల్లించింది. మరో సీజన్ ఆడేందుకు అతడు ఆసక్తి చూపకపోవడంతో.. ట్రేడ్ పద్ధతిన వదిలించుకోవాలనుకుంటోంది రాజస్థాన్. అయితే.. అంతే ధర పలికే ఆటగాడి కోసం చూస్తున్న ఆ ఫ్రాంచైజీ సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను అడుగుతోంది. కానీ, తమ జట్టు కీలక ఆటగాళ్లలో ఒకడైన జడ్డూను ఇచ్చేందుకు చెన్నై సుముఖంగా లేదు.
CSK has been one of the most persistent teams trying to bring Sanju Samson into their setup since 2020
Despite several approaches in the past, Sanju chose to stay with RR. But now as he has decided to leave, CSK won’t miss out this opportunity
This time its closer than ever👀⏳ https://t.co/NlxDslcHlp pic.twitter.com/sI2as9YghZ
— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) November 7, 2025
జడేజా కాకుండా డెవాల్డ్ బ్రెవిస్‌ను అప్పగించేందుకు సీఎస్కే అంగీరిస్తున్నా తమకు మరొకరు కూడా కావాలని రాజస్థాన్ కోరుతోంది. పద్దెనిమిదో సీజన్ ఆఖర్లో సీఎస్కే జెర్సీతో అదరగొట్టిన ఈ సఫారీ కుర్రాడు ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయాడు. రాజస్థాన్ డిమాండ్ నేపథ్యంలో నవంబర్ 7న చెన్నై యాజమాన్యం, సీఈఓ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలు సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ ముగిశాక రాజస్థాన్ ట్రేడ్ డీల్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది.