హైదరాబాద్, ఆట ప్రతినిధి: గోవా వేదికగా నవంబర్ 1 నుంచి మొదలుకానున్న ప్రతిష్టాత్మక ఫిడే ప్రపంచకప్ 2025లో తెలంగాణకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ పాల్గొననున్నాడు. మొదటి రౌండ్లో అతడు కజకిస్థాన్‌కు చెందిన నోగర్బెక్ కాజిబెక్‌తో ఆడనున్నాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ర్యాంకు కల్గిన ఆటగాళ్లు పాల్గొనే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లో పాల్గొనడంపై రిత్విక్ సంతోషం వ్యక్తం చేశాడు. టాప్ ర్యాంక్ ప్లేయర్లతో తలపడనుండటం తన సత్తాకు నిజమైన పరీక్ష అని పేర్కొన్నాడు.