IND vs WI : రెండో టెస్టు మూడో రోజు ఆటకు అంతరాయం కలిగించిన వరుణుడు ఈసారి భారత ఇన్నింగ్స్‌కు అడ్డుపడ్డాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(57) ఔటైన కాసేపటికే వర్షం మొదలైంది. దాంతో, అంపైర్లు ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు. అప్పటికి టీమిండియా వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(37 నాటౌట్), శుభ్‌మన్ గిల్(0)తో ఉన్నారు. దాంతో, రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆధిక్యం ప్రస్తుతం 281 పరుగులకు చేరింది.
కీలకమైన రెండో టెస్టులోనూ ఆతిథ్య వెస్టిండీస్(westindies) జట్టు ఆట మారలేదు. భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే ఆలౌటయ్యింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఆట మొదలైన గంటలోపే చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్(mohammad siraj) 5 వికెట్లతో విండీస్‌ను దెబ్బ కొట్టాడు. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే సత్తా చాటిన ముకేశ్, సిరాజ్‌కు సహకారం అందించాడు. షానన్ గాబ్రియెల్(0)ను సిరాజ్ ఎల్బీగా ఔట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు 183 ఆధిక్యం లభించింది.