Asia Cup 2023: ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో భారత(India) ఏ జట్టు చిత్తుగా ఓడిపోయింది. 128 పరుగుల తేడాతో దాయాది పాకిస్థాన్(Pakistan) ఏ జట్టు గెలుపొందింది. వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. యువరాజ్‌సింగ్ దడియా(5)ను మహమ్మద్ వసీం జూనియర్ బౌల్డ్ చేయడంతో పాక్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. 353 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా కీలక ఆటగాళ్లు చేతులెత్తేశారు.
ఓపెనర్ అభిషేక్ శర్మ(61) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్ యశ్ ధుల్(39), సాయి సుదర్శన్(29) విఫలమవ్వడంతో టీమిండియా ఓటమి మూటగట్టుకుంది. పాక్ బౌలర్ సూఫియన్ మకీం 3 కీలక వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు.
అభిషేక్ శర్మ(61), సాయి సుదర్శన్(29)
తొలుత బ్యాటర్లు దంచి కొట్టడంతో భారత(Team India) ఏ జట్టు ముందు 353 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పాక్ ఓపెనర్లు సయిం అయూబ్(59), షహబ్జద ఫర్హాన్(65) రెచ్చిపోయారు. వీళ్లు ఔటయ్యాక వచ్చిన తయ్యబ్ తహిర్(108 71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్స్‌లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. భారత బౌలర్లలో హంగర్‌గెకర్, రియాన్ పరాగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.