Ashes Series : యాషెస్ సిరీస్ ఆఖరి టెస్టు(Ashes Last Test)లో దంచికొడుతున్న ఆస్ట్రేలియా(Australia)కు వరుణుడు అడ్డు తగిలాడు. నాలుగో రోజు తొలి సెషన్లోనూ ఇంగ్లండ్(England)ను ఆలౌట్ చేసిన పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడింది. 383 పరుగుల ఛేదనలో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(69), డేవిడ్ వార్నర్(58) ఇంగ్లండ్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. డ్రింక్స్ తర్వాత వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. అప్పటికీ ఆసీస్ వికెట్ కోల్పోకుండా 135 పరుగులు చేసింది. కంగారుల విజయానికి 249 మరో పరుగులు కావాలి.
ఆతిథ్య ఇంగ్లండ్(England) రెండో ఇన్నింగ్స్‌లో 395 పరుగులకు ఆలౌటయ్యింది. ఆస్ట్రేలియా ముందు 383 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా ముందు 383 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాడ్ మర్ఫీ(Todd Murphy) బౌలింగ్‌లో జేమ్స్ అండర్సన్(8) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఓవర్‌నైట్ స్కోర్.. 389-9తో ఇంగ్లండ్ జట్టు నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగింది.
జో రూట్(91)
అయితే.. ఆట ప్రారంభమైన కాసేపటికే అండర్సన్‌ను మర్ఫీ ఎల్బీగా ఔట్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో మర్ఫీ, మిచెల్ స్టార్క్ నాలుగేసి వికెట్లు పడగొట్టారు. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు దంచి కొట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే(73), జో రూట్(91), జానీ బెయిర్‌స్టో(78) అర్ధ శతకాలతో జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఆ తర్వాత ఆడిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే కుప్పకూలింది. ఐదు టెస్టుల సిరీస్‌లో కమిన్స్ సేన 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.