Stuart Broad – Hat-trick : ఇంగ్లండ్ లెజెండరీ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ప్రపంచంలోని గొప్ప బౌలర్లలో ఒకడైన అతను యాషెస్ ఐదో టెస్టు(Ashes Series Fifth Test)తో ఆటకు గుడ్ బై చెప్తున్నట్టు ఈరోజు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అతడి రికార్డులు గుర్తు చేసుకుంటున్నారు. టెస్టుల్లో తిరుగలేని బౌలర్ అయిన బ్రాడ్ 12 ఏళ్ల క్రితం భారత జట్టుపై అరుదైన ఫీట్ సాధించాడు.
అవును.. టీమిండియాపై టెస్టు ఫార్మాట్లో హ్యాట్రిక్(Hat-trick) నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మధ్య ఎందరో గొప్ప బౌలర్లు వచ్చినా ఎవరూ కూడా సుదీర్ఘ క్రికెట్లో మన జట్టుపై హ్యాట్రిక్ తీయలేకపోయారు.
భారత జట్టు 2011లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. నాటింగ్హమ్ స్టేడియం(Nottingham Stadium)లో జరిగిన రెండో టెస్టులో బ్రాడ్ హ్యాట్రిక్‌తో హడలెత్తించాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అతను వరుస బంతుల్లో ఎంఎస్ ధోనీ(MS Dhoni), హర్భజన్ సింగ్(Harbhajan Singh), ప్రవీణ్ కుమార్(Praveen Kumar)లను ఔట్ చేశాడు. అప్పటివరకూ రాహుల్ ద్రవిడ్(117) సెంచరీతో భారత జట్టు పటిష్ట స్థితిలో ఉంది. అయితే.. బ్రాడ్ మ్యాజిక్‌తో 288 పరుగులకే ఆలౌటయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్రాడ్ రెండు వికెట్లతో చెలరేగాడు. దాంతో, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 319 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్న బ్రాడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇదొక్కటే కాదు పలుమార్లు ఈ కుడిచేతివాటం పేసర్అద్భుత స్పెల్స్ వేశాడు. 2015లో జరిగిన యాషెస్ సిరీస్‌లో 15 పరుగులకే 8 వికెట్లు కూల్చి ఆస్ట్రేలియా పాలిట విలన్‌గా మారాడు. అంతేకాదు ఆసీస్‌పై 150 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా అతను ఈమధ్యే చరిత్ర సృష్టించాడు.
ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) వికెట్ తీసి అతను ఈ ఫీట్ సాధించాడు. 37 ఏళ్ల బ్రాడ్ టెస్టుల్లో 622 వికెట్లు పడగొట్టాడు. దాంతో, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.