Ajinkya Rahane : భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(Ajinkya Rahane) ఇంగ్లండ్ కౌంటీ జట్టు లీసెస్టర్‌షైర్ (Leicestershire)కు షాకిచ్చాడు. త్వరలో జరుగున్న వన్డే కప్(One-Day Cup) నుంచి తప్పుకుంటున్నట్టు అతను యాజమాన్యానికి చెప్పేశాడు. అతడి నిర్ణయాన్ని క్లబ్ కూడా స్వాగతించింది. ‘రహానే పరిస్థితిని మేము అర్ధం చేసుకోగలం. డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023), వెస్టిండీస్ టూర్(West Indies Tour) కారణంగా రహానే జట్టుతో కలవలేదు.
అయితే.. 35 ఏళ్ల రహానే ఆగస్టు – సెప్టెంబర్ మధ్య విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకనే అతను వన్డే కప్‌లో ఆడడం లేదని సమాచారం ఇచ్చాడు. దాంతో, కౌంటీ చాంపియన్‌షిప్, టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌లకు రహానే స్థానంలో పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను తీసుకుంటున్నాం’ అని లీసెస్టర్‌షైర్ ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం అయితే.. జూన్‌లోనే రహానే లీసెస్టర్‌షైర్ జట్టుతో కలవాల్సింది.
అజింక్యా రహానే
కానీ, ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ఎంపిక కావడంతో అతను వెళ్లలేదు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో రెండె టెస్టులు ఉండడంతో రహానే కౌంటీ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఈ ఏడాది దేశవాళీలో, ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో రహానే సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. లేటు వయసులో చూడ చక్కని షాట్లతో అలరించాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో రహానే
ఈసారి చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు ఫైనల్ చేరడానికి రహానే అద్భుత బ్యాటింగ్ ఓ కారణం. మిడిలార్డర్లో దంచికొట్టి సెలెక్టర్ల దృష్టిలో పడిన అతను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జట్టుకు ఎంపికయ్యాడు. దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఈ మాజీ కెప్టెన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విలువైన రన్స్ కొట్టాడు. గాయం బాధిస్తున్నా కూడా తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. అయితే.. విండీస్ సిరీస్‌లో మాత్రం నిరాశ పరిచాడు.