INDW vs SLW : మహిళల వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. గువాహటి వేదికగా ఆతిథ్య భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఆరంభ పోరు ప్రారంభమైన కాసేపటికే వర్షం మొదైలంది. దాంతో, అంపైర్లు ఆటను నిలిపివేశారు. 10 ఓవర్లకు టీమిండియా వికెట్ నష్టానికి43 పరుగులు స్కోర్ చేసింది.
టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్‌కు దిగగా ఆదిలోనే ఓపెనర్ స్మృతి మంధాన(8) ఔటయ్యింది. ఆ తర్వాత ఓపెనర్ ప్రతీకా రావల్(18 నాటౌట్), హర్లీన్ డియోల్(15 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ఉరికించారు. దాంతో 10 ఓవర్లకు టీమిండియా వికెట్ నష్టానికి43 పరుగులు స్కోర్ చేసింది. వీరిద్దరూ జోరు పెంచుదామనేలోపే వర్షం కురవడం మొదలైంది. దాంతో, సిబ్బంది పరుగున వచ్చి పిచ్‌ను ప్లాస్టిక్ కవర్లతో కప్పివేశారు. ప్రస్తుతానికి చినకులు తగ్గడంతో సూపర్ సాపర్స్ సాయంతో ఔట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేస్తున్నారు. 16:35కు ఆట తిరిగి ప్రారంభం కానుంది.
Rain 🌧️ stops play in Guwahati#TeamIndia 43/1 at the end of powerplay
Scorecard ▶️ https://t.co/m1N52FKTWT#WomenInBlue | #CWC25 pic.twitter.com/CyMc3zFHGI
— BCCI Women (@BCCIWomen) September 30, 2025