ENG vs SL : కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ (England) జోరుకు వరుణుడు అడ్డుపడ్డాడు. ‘బజ్‌బాల్’ ఆటతో శ్రీలంక(Srilanka) బౌలర్లను ఉతకేస్తున్న ఆతిథ్య జట్టు బ్యాటర్లకు బ్రేక్ వేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ దూకుడుగా సాగుతున్న సమయంలో వాన మొదలైంది. దాంతో, అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు.
తొలి సెషన్ మొదలై 15 ఓవర్లు కాగానే లార్డ్స్‌ను వరుణుడు చుట్టుముట్టాడు. చినుకులు పెద్దగా పడడంతో ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగెత్తారు. అప్పటికే గ్రౌండ్ సిబ్బంది గబాగబా వచ్చి పిచ్‌ను ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు. అప్పటికీ ఇంగ్లండ్ స్కోర్.. 76/1. అయితే.. కొద్ది సేపటికే వాన తగ్గినా వెలుతురు తక్కువ ఉండడంతో మ్యాచ్ మరింత ఆలస్యం కానుంది.
Ben Duckett races to a half-century off just 48 balls 🔥https://t.co/wXld9D8ss6 | #ENGvSL pic.twitter.com/2tq2uN5uz3
— ESPNcricinfo (@ESPNcricinfo) September 6, 2024
తొలి రెండు టెస్టుల్లో జయభేరి మోగించిన ఇంగ్లండ్ సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు శుభారంభిచ్చారు. బెన్ డకెట్(51), డానియెల్ లారెన్స్()లు ధనాధన్ ఆడి.. తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. బజ్‌బాల్ ఆటతో రెచ్చిపోతున్న ఈ జోడీని లహిరు కుమార విడదీశాడు. లారెన్స్‌ను ఔట్ చేసి లంకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ఓలీ పోప్(14) క్రీజులో కుదురుకున్నాక జోరు పెంచాడు. మరోవైపు.. తనశైలిలో చెలరేగిన డకెట్.. విశ్వ ఫెర్నాండో ఓవర్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్ పూర్తి అవుతుండగానే వాన మొదలవ్వడంతో మ్యాచ్ నిలిచిపోయింది.