KCR : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఎండగట్టారు. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ.. ఫ్యూచర్ సిటీ అంతా ఉత్తిదే అని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నీ దిక్కుమాలిన పాలీసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా. అంతా గందరగోలం.. గురుకుల పాఠశాల విద్యార్తులు చనిపోయారు. ఇప్పటికి 125 మంది చనిపోయారు. గట్టి అదధికారిని పెట్టి గట్టి చర్యలు తీసుకోలేరా అని గులాబీ బాస్ మండిపడ్డారు.
భూ సేకరణ గురించి కేసీఆర్ మాట్లాడుతూ.. షరుతుతో కూడిన సేకరణను పునరుద్ఘాటించారు. అక్రమంగా ల్యాండ్ పూలింగ్పై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం అంతా సవ్యవంగానే చేస్తున్నామని చెప్పింది. ఇక జూ పార్క్ తీసుకపోయి ఫ్యూచర్ సిటీలో పెడుతాడట. అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో. మేము ఇలాంటి పనులు చేయలే. మీరు ఏం చేయదలచుకున్నా రాష్ట్రాన్ని అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బిజినెస్ హైప్ క్రియేట్ చేయడం మానేయండి. చెప్పాలంటే దీనికి ఆద్యుడు చంద్రబాబే. బాబు చెప్పిన బిజినెస్ లెక్కలు, ఎంవోయూలు విజయవంతం అయితే ఏపీలో ఇప్పటికే రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు రావాలి. అయితే.. వైజాగ్ సభలో ఎంవోయూలు కుదుర్చుకున్నది ఎవరితో అని ఆరా తీస్తే స్టార్ హోటళ్లలోని వంట మనుషలని తేలింది. బాబు మాటే నిజమైతే మరెక్కడి పోయినవి ఆ పెట్టుబడులు. కనీసం రూ.10 వేల కోట్ల అయినా రావాలి కదా అని గులాబీ బాస్ అన్నారు. ఇక రేవంత్ సర్కార్ తీరును ఖండించిన ఆయన ఇంత వంచిస్తారా ప్రజలను.. నికరంగా వస్తే పెట్టుబడులు రావాలిగా? పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది. 575 లక్షల కోట్లు వచ్చినట్టు చెప్పారు. కానీ.. అబద్దపు మాటలతో ఎన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారు.
మేము బిజినెస్ మీటింగ్లు పెట్టలే, పరదాలు కట్టలే. ఆకర్షణీయమైన పాలసీలు తెచ్చాం. ఉత్తమ పాలసీ తెస్తే.. వాళ్లే వస్తారు. మా హయాంలో ప్రదీప్ చంద్ర అత్యుత్తమ పాలసీ రూపొందించాడు. ఫాక్స్కాన్ అనే ఎలక్ట్రానిక్ కంపెనీ తెలంగాణకు రావాలని చాలా కొట్లాడాం. అన్ని దాదాపు సెట్ అయిన సమంయలో రూ.3వేల కోట్లు నగదు ఎదురిస్తామని చెప్పి మహారాష్ట్ర ఆ కంపెనీని తన్నకుపోయింది. అప్పుడు మనదగ్గర డబ్బులు లేకుండే. మా కృషితోనే వరంగల్లో వస్తున్న టెక్స్టైల్ పార్క్.. వస్తున్నాయి. కానీ, రేవంత్ చేస్తున్నది ఆత్మ వంచన. మహిళలకు ఇస్తానన్న రూ.2 వేలకే దిక్కులేదు. కానీ, మహిళల్నీ కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ నేతలు బీరాలు పలుకుతున్నారు. అసలు మా ప్రభుత్వంలో ఉన్న అభివృద్ది సగం ఇప్పుడు రాష్ట్రంలో లేదు. నేను సీఎం అయ్యాక స్కైలైన్ రావాలని మూడేళ్లు తిప్పలు పడ్డాను అని కేసీఆర్ వెల్లడించారు.
మేము భూముల ధరలు పెంచినం. ప్రజల ఆస్తిని పెంచినం. రోడ్డు సమీపంలో 4 ఎరాలున్న వారు ధీమాతో ఉన్నారు. కానీ, కాంగ్రెస్ వచ్చాక ఇప్పుడు ధరలు కుప్పకూలాయి. అమ్మాయి పెళ్లి చేయలేక తక్కువేకే అమ్ముకోవాల్సిన దుస్థితి. కేవలం రాజకీయ అధికారమే లక్ష్యంగా రైతులు, పేద ప్రజలు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులను రేవంత్ రెడ్డి వేధిస్తున్నారు. కేసీర్ చేసిన అప్పులకు పడ్డీలు కట్టలేక పోతున్నాని రేవంత్ చెబుతున్నాడు. కానీ, కాగ్ మనోడికి మొట్టికాయలు వేసింది అని కేసీఆర్ గుర్తు చేశారు. నన్ను తిట్టినదానికి వారి నోళ్లకు మొక్కాలి. పొద్దాక అదే కథనా. మాట్లాడనప్పుడల్లా కేసీఆర్ చచ్చిపోవాలి అనేనా. ఇంత అక్కసుంటాది మనిషిమీద. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. రియాలటీ వేరు. జరుగుతున్నది వేరు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని కాంగ్రెస్ను కడిగిపారేశారు కేసీఆర్.