Paralympics 2024 : పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతకధారుగా ఎంపికయ్యారు. విశ్వ క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో యావత్ భారతావనిని సంబురాల్లో ముంచెత్తిన ఆర్చర్ హర్వీందర్ సింగ్ (Harvinder Singh), అథ్లెట్ ప్రీతి పాల్ (Preethi Pal)లు ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ‘చెఫ్ ది మిషన్’ అధికారి సత్య ప్రకాశ్ సాంగ్వాన్ వెల్లడించాడు.
పారాలింపిక్స్ ఆర్చరీలో హర్వీందర్ స్వర్ణంతో చరిత్ర సృష్టించగా .. అథ్లెటిక్స్‌లో ప్రీతి రెండు కాంస్యాలతో మెరిసింది. భారత దేశ ఖ్యాతిని మరింత పెంచిన ఈ ఇద్దరూ సెప్టెంబర్ 8, ఆదివారం జరుగబోయే ముగింపు వేడుకల్లో త్రివర్ణ పతాకం చేతబూని భారత బృందానికి ముందు నడువనున్నారు.
Harvinder Singh and Preethi Pal will be India’s flag-bearers at the #Paralympics2024 closing ceremony. Their achievements inspire us all! #Paris2024 #Cheer4Bharat@mansukhmandviya @IndiaSports @MIB_India @PIB_India @DDNewslive @ParalympicIndia @PCI_IN_Official @DDIndialive… pic.twitter.com/cjzyHvxloo
— Doordarshan Sports (@ddsportschannel) September 6, 2024
‘పారాలింపిక్స్ ఆర్చరీలో చారిత్రక స్వర్ణం సాధించిన హర్వీందర్ సింగ్, అథ్లెటిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్రీతి పాల్లు ప్రచారకర్తలుగా మనదేశ పట్టుదలను, ఖ్యాతిని చాటారు. ముగింపు వేడుకల్లో పతకధారులుగా వీళ్లిద్దరూ భారత అథ్లెట్ల అసాధారణ ప్రయాణానికి సంకేతంగా నిలుస్తారు. వీళ్లిద్దరూ సాధించిన విజయాలు మనందరిలో స్ఫూర్తి నింపుతాయి. భావి పారా అథ్లెట్లను హర్వీందర్, ప్రీతిలు ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నా’ అని సత్య ప్రకాశ్ సాంగ్వాన్ అన్నాడు.
From triumph to triumph, Preeti Pal has proven her extraordinary talent by winning her second medal in the same edition of the #Paralympics2024!
Your run in the Women’s 200m T35 secured you a Bronze Medal, highlighting your dedication & excellence.
Keep Shining, Proud of you… pic.twitter.com/RZ3Gz6x3Iw— Kiren Rijiju (@KirenRijiju) September 1, 2024
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో ప్రీతి పాల్ అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించింది. మొదట 100 మీటర్ల పరుగు పందెలో కంచు మోత మోగించిన ప్రీతి.. 200 మీటర్ల పరుగులోనూ కాంస్యం కొల్లగొట్టింది. దాంతో, ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలతో ప్రీతి చరిత్ర సృష్టించింది. ఇక హర్వీందర్ విషయానికొస్తే.. ఆర్చరీలో భారత్‌కు అతడు తొలి స్వర్ణం సాధించి పెట్టాడు. టోక్యోలో కాంస్యంతో సరిపెట్టుకున్న హర్వీందర్ చెక్కు చెదరని గురితో పసిడి వెలుగులు విరజిమ్మాడు. ఈ ఇద్దరితో పాటు షూటర్లు, అథ్లెట్స్ రాణించడంతో భారత్ పతకాల సంఖ్య 26కు చేరింది.