Rahul Dravid | అప్పుడు కెప్టెన్‌గా.. ఇప్పుడు కోచ్‌గా.. రాజస్థాన్‌తో ద్రవిడ్ జర్నీ ఇదీ..!
Rahul Dravid : భారత జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కోచింగ్ కెరీర్ మళ్లీ మొదలవ్వనుంది. టీమిండియాను టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిపిన ద్రవిడ్ ఇక ఐపీఎల్లో సత్తా చాటనున్నాడు. తొలి సీజన్ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ నియామకం ఖాయమైంది.
Rahul Dravid : భారత జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కోచింగ్ కెరీర్ మళ్లీ మొదలవ్వనుంది. టీమిండియాను టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిపిన ద్రవిడ్ ఇక ఐపీఎల్లో సత్తా చాటనున్నాడు. తొలి సీజన్ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ నియామకం ఖాయమైంది. ఒకప్పుడు కెప్టెన్‌గా రాజస్థాన్‌ను నడిపించిన లెజెండరీ ఆటగాడు ఇప్పుడు ప్రధనా కోచ్‌గా దిశానిర్దేశనం చేయనున్నాడు.
దాదాపు పదేండ్ల తర్వాత సొంత గూటికి వస్తున్న ద్రవిడ్‌కు ఫ్రాంచైజీ యాజమాన్యం గులాబీ జెర్సీని బహూకరించింది. శుక్రవారం రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ సీఈఓ జేక్ లష్ మెక్‌క్రమ్ ద్రవిడ్‌కు రాజస్థాన్ జెర్సీని అందించాడు. ఆ ఫొటోను రాజస్థాన్ ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. నేను ఇల్లుగా భావించే ఫ్రాంచైజీకి మళ్లీ వస్తున్నందుకు చాలా ఆసంతోషంగా ఉంది. మరొక సవాల్‌ను స్వీకరించేందుకు ఇదే అనువైన సమయం అని భావిస్తున్నా. అందుకు రాయల్స్ జట్టు సరైనది అని ద్రవిడో అన్నాడు.
Rahul Dravid, India’s legendary World Cup-winning coach, is set for a sensational return to Rajasthan Royals! 🇮🇳🤝
The cricket icon was captured receiving his Pink jersey from the Royals Sports Group CEO Jake Lush McCrum. It is believed that the RR Admin was present too,… pic.twitter.com/C6Q8KRDFgW
— Rajasthan Royals (@rajasthanroyals) September 6, 2024

టీమిండియా వాల్‌గా పేరొందిన ద్రవిడ్ ఐపీఎల్ కెరీర్లో పలు జట్లకు ఆడాడు. ద్రవిడ్ 2012, 13లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అనంతరం 2014, 15లో అదే జట్టుకు మెంటార్‌గా సేవలందించాడు. ఆ తర్వాత ద్రవిడ్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు నాలుగు సీజన్ల పాటు మెంటార్‌గా పనిచేశాడు.
మూడు ఐసీసీ ఫైనల్స్
అయితే.. 2019లో రవి శాస్త్రి వారసుడిగా ద్రవిడ్ టీమిండియా హెడ్‌కోచ్ పదవి చేపట్టాడు. అతడి హయాంలో భారత్.. మూడు ఐసీసీ ఫైనల్స్ ఆడింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో రోహిత్ సేన ఓడింది. అయినా నిరుత్సాహపడని ద్రవిడ్.. టీ20 వరల్డ్ కప్‌లో జట్టును విజేతగా నిలిపాడు. ఒక ఆటగాడిగా వరల్డ్ కప్ అందుకోని అతడు కోచ్‌గా తన కలను నిజం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యాడు.
షేన్ వార్న్ సారథ్యంలో..
ఐపీఎల్ తొలి సీజన్లో షేన్ వార్న్(Shane Warne) సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ కప్ కొట్టింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత సంజూ శాంసన్(Sanju Samson) కెప్టెన్సీలో రాజస్థాన్ 2021 ఫైనల్ చేరినా కప్ కొట్టలేకపోయింది. దాంతో, 18వ సీజన్లో ఎలాగైనా ట్రోఫీని అందుకోవాలని రాజస్థాన్ ఫ్రాంచైజీ పట్టుదలతో ఉంది.

మరి.. భారత జట్ట 13 ఏండ్ల పొట్టి కప్ కలకు తెరదించిన ద్రవిడ్.. రాజస్థాన్ ట్రోఫీ నిరీక్షణకు ముగింపు పలుకుతాడా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. అండర్-19 జట్టుకు కోచ్‌గా.. ఐపీఎల్ మెంటార్‌గా ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలికితీసిన ఘనత ద్రవిడ్‌ది. త్వరలో జరుగబోయే ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్‌కు అతడి అనుభవం ఎంతో ఉపయోగపడనుంది.
ఇవి కూడా చదవండి
-
TG Rains | తెలంగాణలో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు..!
-
Paralympics 2024 | పసిడితో మెరిసిన ప్రవీణ్.. పారాలింపిక్స్‌లో స్వర్ణాల ‘సిక్సర్’
-
Central Relief | తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం.. ఏపీ, తెలంగాణకు రూ. 3,300 కోట్లు విడుదల
-
Harish rao | జిట్టా బాలకృష్ణారెడ్డికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి హరీశ్ రావు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

