హైదరాబాద్ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy) భౌతికకాయానికి మాజీ మంత్రి హరీశ్ రావు(Harish rao) నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాలకృష్ణారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. హరీశ్ రావు వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఉన్నారు.
కాగా, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి.. గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పట్టణ శివార్లలోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.