అమరావతి : భారీ వర్షాలు, వరదలకు గురైన రెండు తెలుగు రాష్ట్రాలకు(Telugu states) కేంద్రం (Central) భారీ సహాయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాలకు కలిపి రూ. 3,300 కోట్లను ప్రకటించింది. తక్షణ సహాయ చర్యల కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది . వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు వీటిని విడుదల చేసింది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో జరిగిన విపత్తుపై కేంద్రం చలించింది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టంపై ఆరా తీసిన కేంద్రం నిధులు విడుదల చేసింది.