Paralympics 2024 : పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే విశ్వ క్రీడల్లో 25 పతకాలతో భారత బృందం చరిత్ర సృష్టించింది. తాజాగా ఇండియా ఖాతాలో మరో స్వర్ణం(Gold Medal) చేరింది. శుక్రవారం లాంగ్ జంప్‌లో ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) బంగారు పతకంతో గర్జించాడు. దాంతో, పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. దాంతో ఈ టోర్నీ చరిత్రలోనే భారత్ అత్యధిక పసిడి పతకాలు సొంతం చేసుకుంది.
శుక్రవారం జరిగిన పురుషుల హై జంప్ – టీ64 పోటీల్లో 21 ఏండ్ల ప్రవీణ్ సత్తా చాటాడు. 2.08 మీటర్లు ఎత్తు దూకి పసిడి మోత మోగించాడు. పారాలింపిక్స్‌లో ప్రవీణ్‌కు ఇది వరుసగా రెండో పతకం కావడం విశేషం. 2021లో టోక్యో ఆతిథ్యమిచ్చిన విశ్వ క్రీడల్లో ప్రవీణ్ 2.07 మీటర్ల దూరం జంప్ చేసి పతకం కొల్లగొట్టాడు. ఈసారి తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ.. దేశానికి పసిడి అందించాడు.
Praveen Kumar clinches gold 🥇 at #Paris2024 with his season’s best jump of 2.08 m 🤯
Watch the #Paralympics LIVE on #JioCinema 👈#ParalympicsOnJioCinema #JioCinemaSports #ParalympicsParis2024 #HighJump pic.twitter.com/k6zLWLU9XD
— JioCinema (@JioCinema) September 6, 2024
పారాలింపిక్స్ మొదలైన రెండో రోజే షూటర్ అవని లేఖరా(Aani Lekhara) స్వర్ణంతో దేశానికి తొలి పతకం అందించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె రికార్డు స్కోర్‌తో పసిడి గెలవగా.. మోనా అగర్వాల్ కంచు మోత మోగించింది. వీళ్లిద్దరితో మొదలైన పతకాల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది.
అథ్లెటిక్స్‌లో ప్రీతి పాల్(Preethi Pal) రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించగా… బ్మాడ్మింటన్‌లో తులసిమతి మురుగేశన్, మనీష రామదాసులు పతకాలతో రికార్డు నెలకొల్పారు. ఇక జూడోలోనూ కపిల్ పర్మార్ (Kapil Parmar) లి పతకం అందించి యావత్ భారతావానిని సంబురాల్లో ముంచెత్తాడు.