FSSAI certified prasadam | వినాయక చవితి నవరాత్రులు పెట్టే ప్రసాదాలు చాలా స్పెషల్.. నిష్ఠతో తొమ్మిది రాత్రులు గణేషుడికి పూజలు చేసి నైవేద్యాలు పెడతారు. చవితి సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ కొత్త రూల్ అక్కడ రాజకీయ దుమారం రేపుతుంది. గణనాథుని ప్రతిష్ఠించినా సరే పూజ చేసుకోండి గానీ.. ప్రసాదాలు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు దృవీకరించాకే భక్తులకు పెట్టాలని ప్రభుత్వ నిబంధన పెట్టింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
గణేశ చతుర్థి (Ganesh Chaturthi) పండగ రోజు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వం హిందూ వ్యతిరేకమని బీజేపీ నేతలు ఈ రూల్‌ని ఖండిస్తున్నారు. చవితి దగ్గరపడుతుండటంతో అక్కడ ఈ అంశం చర్చనీయాంశం అయ్యింది. కర్ణాటక ప్రభుత్వం (Karnataka government) తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఆహార నాణ్యత మరియు పరిశుభ్రతను నిర్ధారించడానికి నగరంలోని గణేష్ మండపంలో వడ్డించే ప్రసాదానికి అనుమతి తప్పనిసరి అని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP)కి రాసిన లేఖలో FSSAI పేర్కొంది. అనుమతి లేకుండా ప్రసాదం పంపిణీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది.
During Hindu festivals, government departments under the Congress administration are always highly active. Now, they require Prasada preparation contractors / Individuals for Ganesh Chaturthi to have FSSAI license.
If a rule is to be enforced, it should be applied uniformly… pic.twitter.com/xXPkGDwwTB
— Girish Bharadwaj (@Girishvhp) September 4, 2024
కర్ణాటక ప్రభుత్వం FSSAI అధికారులు చెక్ చేసి అనుమతించిన నైవేద్యాలనే ప్రసాదంగా (prasadam) గణేష్ మండపాల దగ్గర పెట్టాలని నిర్వాహకులకు సర్క్యులర్ జారీ చేసింది. ఆగస్టు 31న జారీ చేసిన సర్క్యులర్‌లో ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ పొందిన వారిని మాత్రమే ప్రసాదం తయారు చేయడానికి అనుమతిస్తారు. కర్ణాటకలో గణేష్ నవరాత్రులు నిర్వహించాలంటే ఇప్పటికే పోలీసులు, BBMP ( బృహత్ బెంగళూరు మహానగర పాలికే), BESCOM తోపాటు ఇతర అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. వీటితోపాటు నిర్వాహకులు ఇప్పుడు ప్రసాదాల పంపిణీకి FSSAI అనుమతి కూడా పొందాలని సర్క్యులర్ రిలీజ్ చేసింది కర్ణాటక సర్కార్. ఈ కొత్త నిర్ణయం వివాదానికి తెర లేపింది. దీంతో బీజేపీ లీడర్లు కాంగ్రెస్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు.