Committee : కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సుధీర్ఘకాలంగా వివాదం కొనసాగుతున్నది. ఈ వివాదం పరిష్కారం కోసం మరో ప్రయత్నంగా కేంద్ర జలసంఘం ఒక కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలోని ఈ కమిటీని వేసింది.
ఈ కమిటీని నోటిఫై చేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులు, కృష్ణా, గోదావరి నదీ బోర్డుల ఛైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ (NWDA) చీఫ్ ఇంజినీర్, సీడబ్ల్యూసీ (CWC) చీఫ్ ఇంజినీర్ సభ్యులుగా ఉన్నారు.