హనుమకొండ చౌరస్తా, జనవరి 2: వరంగల్ నిట్(Warangal NIT) ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుల ఆందోళన చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబూని ప్రధాన గేట్ ఎదుట బైఠాయించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంట్రాక్టర్లు మారిన ప్రతిసారి పాత ఉద్యోగులను తొలగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పదేళ్లుగా నిట్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు తమను రోడ్డున పడేయవద్దని నినదించారు. అధికారులు వెంటనే స్పందించి తమ ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, తొలిగించినవారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.