Ashes Series : యాషెస్ సిరీస్‌లో ఎట్టకేలకు బోణీ కొట్టిన ఇంగ్లండ్ విజయంతో సిరీస్‌ను ముగించాలనుకుంటోంది. బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన బెన్ స్టోక్స్ సేన.. సిడ్నీలోనూ దూకుడే మంత్రగా ఆడనుంది. జనవరి 4న సిడ్నీలో జరుగనున్న చివరి టెస్టు కోసం ఇంగ్లండ్ కీలక మార్పులు చేసింది. ఆ దేశ క్రికెట్ బోర్డు(England Cricket Board) శుక్రవారం 12 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించాలనుకుంటున్న బౌలింగ్ యూనిట్‌ను పటిష్టం చేసుకుంటూ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ (Shoaib Basheer), మాథ్యూ పాట్స్ (Mathew Potts)లకు చోటు కల్పించింది.
పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్‌లో ఓటమితో యాషెస్ సిరీస్ సమర్పించుకున్న ఇంగ్లండ్ మెల్బోర్న్లో పంజా విసిరింది. కుర్ర పేసర్ జోష్ టంగ్ విజృంభణతో ఆతిథ్య జట్టును మట్టికరిపించిన బెన్ స్టోక్స్ బృందం.. సిడ్నీ టెస్టుకు పక్కాగా సిద్ధమవుతోంది. అయితే.. తొడకండరాల గాయంతో బాధపడుతున్న పేసర్ గస్ అట్కిన్సన్(Gus Atkinson) ఐదో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మాథ్యూ పాట్స్ ఎంపికయ్యాడు. మెల్బోర్న్ ఓటమి నుంచి తేరుకొని విజయ గర్జన చేయాలనుకుంటున్న ఆసీస్ స్టీవ్ స్మిత్ సారథిగా బరిలోకి దిగనుంది. అయితే.. నాలుగో టెస్టు స్క్వాడ్‌లో ఆ దేశ బోర్డు ఏ మార్పులు చేయలేదు.
➡️ Shoaib Bashir
➡️ Matthew PottsWe’ve named our 12-man squad for the fifth and final Ashes Test against Australia 👇
— England Cricket (@englandcricket) January 2, 2026
ఇంగ్లండ్ తుది జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జో రూట్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), షోయబ్ బషీర్,బ్రైడన్ కార్సే, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్.