Ola Auto Driver | పెరుగుతున్న టెక్నాలజీతో సమస్యలు కూడా వస్తాయంటే నమ్ముతారా.. బెంగళూర్ సిటీలో జరిగిన అందుకు నిదర్శనం ప్రస్తుతం ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువతి ఓలా యాప్‌లో ఆటో బుక్ చేసింది. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆటో.. ఆమె పిక్అప్కు పాయింట్‌కు చేరుకోవటానికి 15 నిమిషాలు పట్టింది. తీరా ఆటోడ్రైవర్ ఆమె దగ్గరికి వచ్చాక ఆ యువతి రైడ్ క్యాన్సిల్ చేసింది. దీంతో ఆటోడ్రైవర్‌కు కోపం వచ్చింది.
ఇద్దరు అమ్మాయిలు బెంగళూర్ సిటీలో బయటకు వెళ్లాలనుకున్నారు. టైం లేదు తర్వగా వెళ్లాలని ఓలాలో రెండు ఆటోలను బుక్ చేశారు. ఏ ఆటో త్వరగా వస్తే అందులో వెళ్దాం అనుకున్నారు. అనుకున్నట్లు గానే బుక్ చేసిన రెండు ఆటోల్లో ఒకటి ముందు వచ్చింది. మిగిలిన రైడ్‌ను క్యాన్సల్ (Cancelling Ride) చేశారు అమ్మాయిలు. రైడ్ క్యాన్సల్ అయిందన్న ఆవేశంలో ఆటో డ్రైవర్ యువతిపై రెచ్చిపోయాడు. రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశావ్.. పెట్రోల్ ఊరికే వస్తుందా.. పెట్రోల్ డబ్బులు నీ బాబు ఇస్తాడా అని కోపంగా ఊగిపోయాడు. మాటామాటా పెరిగే ఆటోడ్రైవర్ యువతిని చెంప దెబ్బ(Slapped) కొట్టాడు. రోడ్డుపై జరుగుతున్న ఈ వ్యవహారాన్ని చూస్తున్న మిగతా ఆటోడ్రైవర్లు, స్థానికులు జోక్యం చేసుకుని ఆటోడ్రైవర్‌ను శాంతిపరిచారు.
Yesterday I faced severe harassment and was physically assaulted by your auto driver in Bangalore after a simple ride cancellation. Despite reporting, your customer support has been unresponsive. Immediate action is needed! @Olacabs @ola_supports @BlrCityPolice pic.twitter.com/iTkXFKDMS7
— Niti (@nihihiti) September 4, 2024
దీనిపై యువతి.. పోలీసులకు కంప్లయింట్ చేస్తానని అనటంతో ఆటోడ్రైవర్(Ola Auto Driver) మళ్లీ రెచ్చిపోయాడు. పోదాం పదా పోలీసుల దగ్గరకన్నాడు. ఆటో రైడ్ క్యాన్సిల్ వల్ల నాకు వచ్చిన నష్టాన్ని నీ బాబు ఇస్తాడా అంటూ మళ్లీ ఫైర్ అయ్యాడు. దీంతో చేసేది లేక ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆటోడ్రైవర్ యువతితో ప్రవర్తించిన తీరు మొత్తాన్ని వీడయో తీసింది. ఎక్స్‌లో ఆ వీడియో పోస్ట్ చేసి బెంగళూర్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసింది. యువతిని కొట్టినందుకు పోలీసులు ఆటో డ్రైవర్‌ను(Police Arrest ) అరెస్ట్ చేశారు.
దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 4 కిలోమీటర్ల నుంచి వచ్చిన ఆటో రైడ్‌ను ఎలా క్యాన్సిల్ చేస్తారని యువతిపై మండిపడుతున్నారు. మరికొందరు ఆటోడ్రైవర్‌ను సమర్థిస్తూ పెట్రోల్ ఊరికే వస్తుందా.. అందులోనూ బెంగళూరు సిటీలో పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదా అంటూ ఆ అమ్మాయిని తిడుతున్నారు. మరికొందరు మాత్రం ఆటోడ్రైవర్ అలా చేయకూడదని, క్యాన్సిల్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆమె అలా చేసిందని కామెంట్ చేస్తున్నారు. తన సమస్యకు పరిష్కారం ఓలా యాప్ వాళ్లను అడగాలి కదా అని యువతిని వెనుకేసుకొస్తున్నారు. ఇంత మాత్రానికి యువతిని కొడతాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.