కాచిగూడ,సెప్టెంబర్ 6 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధుడు మృతి(Old man dies) చెందాడు. కాచిగూడ రైల్వే హెడ్‌కానిస్టేబుల్ సమ్మయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని వృద్ధుడు (60)శుక్రవారం యాకత్‌పుర-డబీర్‌పుర రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా ఎంఎంటీఎస్ రైలు(MMTS train) ఢీకొనడంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతి చెందిన వృద్ధుడి వివరాల కోసం 9948695948లో సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తన్నట్లు సమ్మయ్య తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణలో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు..!
Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్
Actor Nithiin | తండ్రైన హీరో నితిన్