హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): కృత్రిమ మేధ (ఏఐ)లో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖa మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం హైటెక్ సిటీలో ఎయిడెన్ ఏఐ ఇంజినీరింగ్ కేంద్రం విస్తరణ పనులను మం త్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడెన్ ఏఐలో ప్రస్తుతం 500 మంది నిపుణులు పనిచేస్తుండగా, వచ్చే రెండేండ్లలో మరో 500 మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. కాగా, న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. ఏఐలో నూతన ఆవిషరణల ద్వారా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈవో కిరణ్ వెంట్రప్రగడ, సీవోవో శ్రీని కమిడి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏటా నిర్వహించే బయో ఏషియా సదస్సు ఈ ఏడాదికిగాను ఫిబ్రవరి 16-18 వరకు జరుగనున్నది. ‘టెక్బయో అన్లాష్డ్-ఏఐ, ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్’ అనే థీమ్‌తో నిర్వహించనున్నారు. గురువారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.