తిరుపతి : తిరుమల ( Tirumala ) శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి 20 బ్రెత్ అనలైజర్లు ( Breath Analyzers ) అందించినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్( EO Anil Kumar Singhal ) సింఘాల్ తెలిపారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఘాట్ రోడ్లలో రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనాల భద్రతకు టీటీడీ చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఇందులో భాగంగా సుమారు రూ.8లక్షల విలువైన 20 బ్రెత్ ఎనలైజర్లు జిల్లా ఎస్పీ కి అందించినట్లు పేర్కొన్నారు. భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుoదని , ఇందుకు కోసం పోలీస్ శాఖకు అత్యాధునిక పరికరాలు అందించేందుకు సిద్ధమని తెలిపారు.
అనంతరం జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు బ్రెత్ అనలైజర్ల పనితీరును ఈవోకు వివరించారు. మొత్తం 20 పరికరాలలో తిరుమలలో 4, అలిపిరిలో 4, తిరుపతిలో 12 పోలీస్ శాఖ వినియోగిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, తిరుమలకు చెందిన పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.