IND vs ENG : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో కీలకమైన ఓవల్ టెస్టుకు వర్షం (Rain) అంతరాయం కలిగించింది. నాలుగోరోజు టీ బ్రేక్ సమయంలో చినుకులు మొదలయ్యాయి. దాంతో, ఔట్‌ఫీల్డ్ తడిగా మారింది. కొద్దిసేపటికే వాన తగ్గడంతో గ్రౌండ్ సిబ్బంది నీటిని తోడేసే పనిలో ఉన్నారు. పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు.. 9 గంటలకు మ్యాచ్‌ను కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు. దాంతో.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మరికొన్ని నిమిషాల్లో మొదలవ్వనుంది.
సిరీస్ విజేతను నిర్ణయించే ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్టు సమిష్టిగా రాణించి గెలుపుపై ఆశలు రేపినా బౌలర్లు తేలిపోయారు. 375 పరుగుల ఛేదనలో యువ కెరటం హ్యారీ బ్రూక్ (111) సెంచరీతో చెలరేగగా, రన్ మెషీన్ జో రూట్ (98 నాటౌట్) అర్ధ శతకంతో టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు.
The drizzle intensifies and the covers have come on at the tea break at The Oval ☔ #ENGvIND pic.twitter.com/Xegp8HUQYv
— ESPNcricinfo (@ESPNcricinfo) August 3, 2025
భారత పేస్ దళాన్ని సమర్ధంగా ఎదుర్కొన్న ఈ ద్యయం కొండంత లక్ష్యాన్ని చూస్తుండగానే కరిగించింది. అయితే.. టీకి ముందు బ్రూక్‌ను ఆకాశ్ దీప్ ఔట్ చేసి ఊరటనిచ్చాడు. కానీ, జాకబ్ బె|థెల్(1) అండగా రూట్ జట్టును సిరీస్ విజేతగా నిలిపేందుకు గట్టిగానే పోరాడుతున్నాడు. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 317 రన్స్ కొట్టింది. మరో 57 రన్స్ కొడితే తొలిసారి నిర్వహిస్తున్న అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీని కైవసం చేసుకోనుంది.