INDW vs BANW : మహిళల ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌నూ వరుణుడు వదలడం లేదు. భారత్, బంగ్లాదేశ్ పోరుకు టాస్ తర్వాత ఆటకు అడ్డుపడిన వర్షం.. పవర్ ప్లే పూర్తికాగానే మళ్లీ మొదలైంది. డీవై పాటిల్ స్టేడియలో ప్రస్తుతం భారీగా వాన పడుతోంది. దాంతో.. అంపైర్లు ఆటను నిలిపివేశారు. వర్షం అంతరాయం కలిగించే సరికి బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. ఓపెనర్ షర్మీన్ అక్తర్(18 నాటౌట్), కెప్టెన్ నిగర్ సుల్తానా(2 నాటౌట్)లు అజేయంగా ఉన్నారు.
గంటలోపే మరోసారి వర్షం రావడంతో 43 ఓవర్ల ఆటపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ వాన తగ్గినా ఔట్‌ఫీల్డ్ సిద్ధం చేసేసరికి కనీసం గంట సమయం పట్టే అవకాశముంది. అదే జరిగితే.. మ్యాచ్‌ను మరిన్ని ఓవర్లకు తగ్గించడం ఖాయం. వర్షం బ్రేక్ ఇవ్వకుంటే.. ఆటను రద్దు చేసే ఛాన్సూ ఉంది.
Another one for #TeamIndia ☝️
Our leading wicket-taker of #CWC25 Deepti Sharma gets her 1️⃣st wicket of the match 👌
Updates ▶ https://t.co/lkuocSlGGJ#WomenInBlue | #INDvBAN | @Deepti_Sharma06 pic.twitter.com/jJSik3DPDm
— BCCI Women (@BCCIWomen) October 26, 2025
డీవై పాటిల్ స్టేడియంలో న్యూజిలాండ్‌పై నిప్పులు చెరిగిన రేణుకా సింగ్(1-23) బంగ్లాదేశ్‌పైనా చెలరేగుతోంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో బంగ్లా ఓపెనర్ సుమైయా అక్తర్(2)ను ఔట్ చేసింది. చివరి బంతికి షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో ఆడిన అక్తర్.. అక్కడే కాచుకొని ఉన్న శ్రీ చరణి చేతికి చిక్కింది. 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాను రుబియా హైదర్(13), షర్మీన్ అక్తర్(15 నాటౌట్) ఆదుకున్నారు. కానీ.. వీరి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేస్తూ పవర్ ప్లే ముగియగానే రెండో వికెట్ అందించింది దీప్తి శర్మ.