SLW vs SAW : స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో శ్రీలంక (Srilanka)కు బోణీ కష్టాలు తప్పడం లేదు. సొంతగడ్డపై అదరగొడుతూ పాయింట్ల ఖాతా తెరవాలనుకుంటున్న లంకను వరుణుడు (Rain) వెంటాడుతున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగాల్సిన మ్యాచ్లు వాన కారణంగా రద్దు అయ్యాయి. ముచ్చటగా మూడోసారి కూడా శ్రీలంక మ్యాచ్కు వర్షం అడ్డుపడింది. ఒకవేళ ఆట సాధ్యం కాకుంటే లంక కొంప కొల్లేరు అయినట్టే. ఎందుకుంటే.. ఇప్పటికే రెండు పాయింట్లతో సెమీస్ రేసులో వెనకబడిన చమరి ఆటపట్టు బృందానికి ఇది మింగుడుపడని విషయమే.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన చమరి ఆటపట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. లంక ఇన్నింగ్స్ 12 ఓవర్లు పూర్తి కాగానే వాన అందుకుంది. భారీగా చినుకులు పడడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికీ లంక స్కోర్ 46\2. కవిశ దిల్హరి(6), హర్షిత సమరవిక్రమ(5)లు అజేయంగా క్రీజులో ఉన్నారు. 4:15 గంటలకు వాన తెరిపినివ్వడంతో ఇరుజట్ల ప్లేయర్లు హమ్మయ్య అనుకున్నారు. కానీ, మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో ఆట సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ మ్యాచ్ కూడా వర్షార్పణం అయితే.. లంక కంటే దురదృష్టమంమైన జట్టు ఇంకోటి ఉండదేమో.
Rain stops play in Colombo 🌧️⏸️
📺 Stream #CWC25 on DStv: https://t.co/rM90YyQxaw#HereForHer | #SSCricket pic.twitter.com/KDRfy8tPFT
— SuperSport 🏆 (@SuperSportTV) October 17, 2025