Ranji Trophy 2024 | రంజీ క్రికెట్ చరిత్రలో రైల్వేస్ సంచలనం సృష్టించింది. 1934 నుంచి మొదలైన ఈ టోర్నీ చరిత్రలో రైల్వేస్.. అత్యధిక పరుగుల ఛేదనను విజయవంతంగా సాధించింది. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఎలైట్ గ్రూప్ సి లో ఉన్న రైల్వేస్.. ఫైనల్ లీగ్ మ్యాచ్‌లో త్రిపుర విధించిన 378 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో వంద పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డ రైల్వేస్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారీ లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా గతంలో సౌరాష్ట్ర పేరిట ఉన్న 372 పరుగుల ఛేదన రికార్డును బ్రేక్ చేసింది.
త్రిపురలోని మహారాజా బిర్ బిక్రమ్ కాలేజ్ స్టేడియం వేదికగా ఈనెల 16న మొదలైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర.. 149 రన్స్‌కు ఆలౌట్ అయింది. బదులుగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రైల్వేస్.. 105 పరుగులకే ఆలౌట్ అయి త్రిపురకు 44 పరుగుల ఆధిక్యాన్ని అందించింది. రెండో ఇన్నింగ్స్‌లో త్రిపుర.. 333 పరుగులు చేయడంతో రైల్వేస్ ఎదుట 378 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం రైల్వేస్ ఛేదనలో 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ ఓపెనర్ ప్రథమ్ సింగ్ (169 నాటౌట్), మహ్మద్ సైఫ్ (106) లు శతకాలతో రాణించారు. అరిందమ్ ఘోష్ (40) , ఉపేంద్ర యాదవ్ (27 నాటౌట్)లు ఆఖర్లో ప్రథమ్ సింగ్‌కు అండగా నిలిచి 378 లక్ష్యాన్ని సాధించి ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు.
What. A. Chase👌👌
Centuries from Pratham Singh (169*) and Mohammad Saif (106) helped Railways pull off highest successful fourth innings run chase of 378 in #RanjiTrophy, against Tripura in Agartala 🔥@IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/U4PBZghrkb pic.twitter.com/7WFsoQYSLq
— BCCI Domestic (@BCCIdomestic) February 19, 2024
రంజీలలో హయ్యస్ట్ ఛేజింగ్స్..
– 378/5 రైల్వేస్.. త్రిపురపై 2023-24
– 372/4 సౌరాష్ట్ర.. ఉత్తరప్రదేశ్‌పై 2019-20
– 371/4 అస్సాం.. సర్వీసెస్‌పై 2008-09
– 360/4 రాజస్తాన్.. విదర్భపై 1989-90
– 359/4 ఉత్తరప్రదేశ్.. మహారాష్ట్రపై 2021-22