Software Engineer | ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు డ్రగ్స్ దందా కొనసాగిస్తూ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడింది. వివరాళ్లోకి వెళితే.. చిక్కడపల్లిలో పోలీసులు డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న సుస్మిత అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తోంది.
సుస్మిత బాయ్‌ఫ్రెండ్ ఇమ్మాన్యుల్తో కలిసి డ్రగ్స్ విక్రయిస్త్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఈ వ్యవహారంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఎండీఎంఏ, ఎస్ఎస్డీ బాటిల్స్, ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.