హైదరాబాద్: రియల్ ఎస్టేట్ కంపెనీ ఏఎస్బీఎల్ ఈ యేడాది ఫ్యామిలీ డే(ASBL Family Day) సంబురాలను గ్రాండ్‌గా నిర్వహించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అన్వయ కన్వెన్షన్‌లో డిసెంబర్ 20వ తేదీన ఆ వేడుక జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీ కస్టమర్లు, కుటుంబసభ్యులు .. చాలా ఉత్సాహాంగా, ఉల్లాసంగా ఫ్యామిలీ డే ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆ అద్భుత ఘడియాలను వాళ్లు ఫుల్ ఎంజాయ్ చేశారు. కస్టమర్లతో చాలా సన్నిహిత రిలేషన్ పెట్టుకోవడమే తమ ముఖ్య ఉద్దేశమన్న రీతిలో ఏఎస్బీఎల్ ఫ్యామిలీ డే సంబరాలను నిర్వహించారు. విశ్వాసం, విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ఎంతో సంతోషకరమైన వాతావరణంలో ఏఎస్బీఎల్ ఫ్యామిలీ డే ఈవెంట్‌ను చేపట్టారు.

Asbl1
ఫ్యామిలీ మీట్ సందర్భంగా ఎన్నో సాంస్కృతిక, సమకాళీన కార్యక్రమాలను నిర్వహించారు. నృత్య ప్రియ తన క్లాసికల్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. శ్రావ్యమానస డ్యాన్స్ బృందం రామాయణం స్కిట్‌తో భక్తిని ప్రదర్శించింది. మహిళా బృందంతో కూడిన యో హైనెస్ డ్యాన్స్ టీమ్ ఈవెంట్లో ఫుట్ జోష్ నింపింది. నిరావల్ బ్యాండ్ తన మ్యూజికల్ పర్ఫార్మెన్స్తో ఫ్యామిలీ వేడుకలను థ్రిల్ చేసింది. ఈవెంట్‌కు హాజరైన కస్టమర్లు, గెస్టులు.. ఎంటర్టైన్మెంట్, డిన్నర్లో పాల్గొని ఏఎస్బీఎల్ మాధుర్యాన్ని అనుభవించారు.

Asbl2
ఏఎస్బీఎల్ సీఈవో అజితేశ్ కోరుపోలు ఈ వేడుక సందర్భంగా ప్రత్యేక ప్రసంగం చేశారు. కంపెనీ జర్నీ గురించి ఆయన వివరించారు. కంపెనీ ప్రగతిలో కస్టమర్ల పాత్రను ఆయన వివరించారు. ఫ్యామిలీ డే సంబరాలు.. ఏఎస్బీఎల్ విశ్వాసానికి మరోపేరు అని ఆయన అన్నారు. కేవలం ఇండ్లను నిర్మించి ఇవ్వడమే కాదు.. వాటిని ఆవాసాలుగా తీర్చిదిద్దుతామన్నారు. కుటుంబాలు, బంధాలు బలపడే రీతిలో ఉంటుందన్నారు. కస్టమర్ల ప్రదర్శించిన విశ్వాసమే తమ కంపెనీ ప్రగతికి పునాదిగా మారినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్తులో తమ కంపెనీ పబ్లిక్ లిస్టింగ్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఏఎస్బీఎల్ ఫౌండర్స్ క్లబ్‌ను ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఆ క్లబ్లో పిల్లల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ ఈవెంట్స్ చేసుకోవచ్చు అని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో దశలవారీ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఏఏఈడీ .. న్యూ డిజైన్ స్టూడియోను ఆవిష్కరించారు.