Raja Saab | టాలీవుడ్ డైరెక్టర్ మారుతి-గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబోలో వస్తోన్న చిత్రం రాజాసాబ్ (Raja saab). హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజికల్ ఆల్బమ్ నుంచి మరో సాంగ్ వస్తోంది. కాగా ఇప్పుడు రాజాసాబ్ రన్‌టైం టాపిక్ ఆసక్తికరంగా మారింది.
కొన్ని సినిమాలకు కథానుగుణంగా లాంగ్ రన్ టైం ఫిక్స్ చేస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటీవలి కాలంలో వచ్చిన పుష్ప 2, అవతార్ ౩, ధురంధర్ సినిమాలు ఈ కేటగిరీలోకే వస్తాయి. ఈ సినిమాలు ౩ గంటల 20 నిమిషాలు అంతకంటే ఎక్కువ రన్‌టైంతో ఉన్నాయి. ఇదే లైన్లో ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాజాసాబ్ ఉండబోతుందన్న వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. రాజాసాబ్ మేకర్స్ లాంగ్ రన్టైంకే ఎక్కువ ఆసక్తి చూపించారని ఇన్సైడ్ టాక్.
ఫిలింనగర్ సర్కిల్ కథనాల ప్రకారం రాజాసాబ్ రన్ టైం 3 గంటలు ఉందట. మారుతి టీం టైటిల్స్,క్రెడిట్స్‌తో కలిపి ఈ రన్‌టైం ఫిక్స్ చేసినట్టు టాక్. అంటే మరీ సాగదీసిన ఫీలింగ్ అనిపించదని.. ఇంతకంటే ఎక్కువ రన్‌టైం ఉన్న సినిమాలను చూస్తే అర్థమవుతోంది. రన్ టైం విషయంలో యాక్షన్ ప్యాక్డ్ సినిమాల ట్రెండ్‌తో పోలిస్తే రాజాసాబ్ హార్రర్ కామెడీ కావడం.. గ్లామరస్ కోటెంట్తోపాటు రొమాన్స్, సాంగ్స్, కామెడీ ఎలిమెంట్స్‌తో ఉండే రన్‌టైంను సంక్రాంతి సీజన్‌కు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే షేర్ చేసిన రాజాసాబ్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌కు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రాజాసాబ్‌లో సంజయ్ దత్ సంజూబాబా పాత్రలో కనిపించబోతున్నాడు.
Dhurandhar | ‘ధురంధర్’ కలెక్షన్లపై పాక్ ప్రజల వింత డిమాండ్.. కలెక్షన్స్‌లో మాకు వాటా ఇవ్వాలి..
Nani | నాని ‘ది ప్యారడైజ్’లో డ్రాగన్ బ్యూటీ.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
Karate Kalyani | హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు.. కరాటే కల్యాణి ఊహించని స్పందన