KL Rahul : ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) శతకం సాధించాడు. క్లాస్ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్న రాహుల్ లంచ్ తర్వాత ఆర్చర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి మూడంకెల స్కోర్ అందుకున్నాడు. ఈ సిరీస్‌లో అతడికిది రెండో వంద కాగా మొత్తంగా ఈ ఫార్మాట్లో పదో శతకం. దాంతో, లార్డ్స్ మైదానంలో రెండు పర్యాయాలు మూడంకెల స్కోర్ చేసిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించాడీ సొగసరి బ్యాటర్. దిలిప్ వెంగ్‌సర్కార్ (Dilip Vengsarkar) మూడు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇంగ్లండ్‌పై రాహుల్‌కు ఇది నాలుగో సెంచరీ. అంతేకాదు పర్యాటక జట్టు తరఫున లార్డ్స్ మైదానంలో రెండో శతకం బాదిన నాలుగో ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. రాహుల్ కంటే ముందు లార్డ్స్‌లో రెండు శతకాలు బాదిన ఓపెనర్లు ముగ్గురు మాత్రమే. బిల్ బ్రౌన్(ఆస్ట్రేలియా), గోర్డన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్), గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా)లు ఈ ఘనత సాధించారు.
KL Rahul becomes just the second Indian batter to score multiple Test hundreds at Lord’s, joining Dilip Vengsarkar (3) 👏 pic.twitter.com/caFEwM3OpC
— ESPNcricinfo (@ESPNcricinfo) July 12, 2025
టెస్టుల్లో రాహుల్ బాదిన 10 శతకాల్లో తొమ్మిది విదేశీ గడ్డపైనే కావడం గమనార్హం. అయితే.. వంద కొట్టిన తర్వాత అందర్నీ షాక్‌కు గురి చేస్తూ బషీర్ ఓవర్లో హ్యారీ బ్రూక్‌కు సులువుగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడీ రైట్ హ్యాండర్. దాంతో, 254 వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది.