నల్లగొండ రూరల్, జూలై 12 : నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమడే హోటల్స్, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు పి.స్వాతి, నిమ్మల శివశంకర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని రాక్హిల్స్ కాలనీలో గల డైరీ, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని వారు ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఐస్ క్రీమ్‌లపై తయారీ తేదీలు లేకుండా ఉండడంతో పాటు రసాయనాలు, సింథటిక్ రంగులు కలిపి ఐస్ క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో డైరీ టెక్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అదేవిధంగా రూ.3 లక్షల విలువ చేసే ఐస్ క్రీమ్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని వ్యాపాస్తులు విధిగా ఫుడ్ లైసెన్స్‌లు తీసుకోవాలని పేర్కొన్నారు.