KL Rahul : ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో అత్యధిక ధర పలికే వాళ్లలో కేఎల్ రాహుల్ (KL Rahul) ఒకడు. గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (Luckonw Super Giants ) కెప్టెన్ అయిన రాహుల్ వేలంలో రికార్డు ధరకు అమ్ముడయ్యే అవకాశముంది. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా (Sanjeev Goenka)తో పొసగక బయటికొచ్చేసిన రాహుల్ తొలిసారి తన భవిష్యత్ గురించి స్పందించాడు. ఇంతకుముందులా ఒత్తిడితో కూడిన వాతావరణంలో కాకుండా స్వేచ్ఛగా ఉండే ఫ్రాంచైజీకి ఆడాలని అనుకుంటున్నానని రాహుల్ తెలిపాడు.
‘ఐపీఎల్‌ను కొత్తగా ఆరంభించడంతో పాటు నాకున్న అవకాశాల్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నా. అంతేకాదు నాకు స్వేచ్ఛ లభించే ఫ్రాంచైజీలో ఆడాలని ఉంది. జట్టు వాతావరణం సౌకర్యంగా ఉంటుందో అక్కడ ఉండాలని ఉంది. కొన్నిసార్లు మనం కొన్నింటికి దూరం కావాల్సి ఉంటుంది. మనకు ఏది మంచిదో అదే చేయాల్సి వస్తుంది’ అని రాహుల్ వెల్లడించాడు.
KL Rahul said, “I wanted to start fresh, I wanted to explore my options and and I wanted to go and play where I could find some freedom. The team atmosphere would be lighter, sometimes you just need to move away and find something good for yourself”. (Star Sports). pic.twitter.com/gFfALa2iDH
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2024
తద్వారా లక్నో యజమాని సంజీవ్ గొయెంకా తీరును పరోక్షంగా రాహుల్ విమర్శించాడు. అయితే.. విజయకాంక్ష కలిగిన వాళ్లే మాకు కావాలి అంటూ సంజీవ్ తమ రిటైన్ జాబితాను ప్రకటించడం గమనార్హం. 18వ సీజన్ మెగా వేలం కోసం రాహుల్ రూ.2 కోట్ల కనీస ధరకు పేరు రిజిష్టర్ చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా వేలం జరుగనుంది.
KL Rahul made fans so happy ❤️ who turned up for India A test match. He looks so handsome in whites and long hair with that cuteeeee smile 😍 pic.twitter.com/fGIpP3IDuo
— KL RAHUL 👑 (@KLRlifeline) November 10, 2024
పీఎల్ 18వ సీజన్ కోసం లక్నో ఫ్రాంచైజీ చిచ్చరపిడుగు నికోలస్ పూరన్ (Nicholas Pooran)ను తొలి ప్రాధాన్యంగా అట్టిపెట్టుకుంది. పూరన్‌కు రూ.21 కోట్లు చెల్లించేందుకు సిద్దమైంది. పేస్ సంచలనం మయాంక్ యాదవ్ (Mayank Yadav), యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లతో పాటు అన్క్యాప్డ్ ప్లేయర్లుగా ఆకాశ్ బదొని, పేసర్ మొహ్సిన్ ఖాన్లు జట్టుతో కొనసాగనున్నారు.
కేఎల్ రాహుల్ సారథ్యంలో లక్నో ప్లే ఆఫ్స్‌కే పరిమితం అయింది. మోకాలి గాయం కారణంగా 16వ సీజన్ నుంచి మధ్యలోనే వైదొలిగిన రాహుల్.. 17వ సీజన్లో పెద్దగా రాణించలేదు. అతడి కెప్టెన్సీ కూడా ఫ్రాంచైజీని మెప్పించలేదు.
KL Rahul said 🗣️, “I wanted to start fresh, I wanted to explore my options and I wanted to go and play where I could find some freedom. The team atmosphere would be lighter.
Everyone knows what Goenka has done with Dhoni and KL Rahul. pic.twitter.com/0SCNE2lvHK
— Shivam Tripathi¹ ✗ 💥 (@iamshivam222) November 11, 2024
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సమయంలో అందరూ చూస్తుండగానే రాహుల్‌పై లక్నో యజమాని సంజీవ్ గొయెంకా (Sanjeev Goenka) ఆగ్రహం చేసిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత సంజీవ్ ఈ వివాదానికి తెరదించినా రాహుల్ మాత్రం జట్టును వీడేందుకే సిద్దమయ్యాడు. 2022 మినీ వేలంలో లక్నో రూ.17 కోట్లు పెట్టి రాహుల్‌ను కొన్నది.