Viral Video | ప్రస్తుత సమాజంలో రీల్స్ ట్రెండ్ (Shoot Reel) నడుస్తోంది. ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్లు ఉండటంతో.. రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను విచ్చల విడిగా వాడేసుకుంటున్నారు. ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం..? అవేవీ పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి రీల్స్ కోసం తన ఎస్యూవీ కారును ఏకంగా రైల్వే ట్రాక్ (Railway Track)పై నడిపి కటకటాలపాలయ్యాడు.
ఓ వ్యక్తి రీల్స్ పిచ్చితో తన మహీంద్రా థార్ (Thar) వాహనాన్ని జైపూర్ (Jaipur)లోని రైల్వే ట్రాక్‌పై నడిపాడు. అదేసమయంలో అటుగా ఓ గూడ్స్ రైలు వస్తోంది. ఇంతలో థార్ ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయింది. అయితే, లోకో పైలట్ సకాలంలో కారును చూసి రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఆ సమయంలో సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల సాయంతో కారును పట్టాల నుంచి బయటకు తీయగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.
इस गाड़ी को तुरंत प्रभाव से जब्त करना चाहिए,स्टंट दिखाने के चक्कर में कईयों की जान ले लेता।@RailMinIndia @RailwaySeva @Central_Railway @AshwiniVaishnaw@WesternRly @PoliceRajasthan @jaipur_police pic.twitter.com/44ztKg3aLo
— Sangram Singh 🇮🇳🚩 (@sangramsingh_95) November 12, 2024
Also Read..
Actor Kasthuri | తెలుగు వారిపై సంచలన వ్యాఖ్యలు.. అజ్ఞాతంలోకి నటి కస్తూరి..!
Champions Trophy 2025 | పీసీబీకి దిమ్మదిరిగే షాక్.. దక్షిణాఫ్రికాలో చాంపియన్స్‌ట్రోఫీ..!