Ajinkya Rahane : పొట్టి ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త నాటకానికి తెరతీసింది. మా ప్రభుత్వం అనుమతిస్తేనే వరల్డ్‌కప్ ఆడుతామంటూ పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) వ్యాఖ్యానించాడు. అయితే.. పాక్ బోర్డు బాయ్‌కాట్ వార్తలను భారత మాజీ క్రికెటర్ అజింక్యా రహానే (Ajinkya Rahane) ఖండించాడు. పాక్ బోర్డు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని, వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేసేంత దమ్ము, ధైర్యం ఆ దేశానికి లేవని రహానే అన్నాడు.
ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ పీసీబీ చీఫ్ బెదిరింపులను టీమిండియా మాజీ ఆటగాడు అజింక్యా రహానే కొట్టిపారేశాడు. గురువారం క్రిక్‌బజ్‌తో మాట్లాడిన అతడు ‘పాకిస్థాన్ జట్టు వరల్డ్‌కప్ బాయ్‌కాట్ చేస్తుందని నేను అనుకోవడం లేదు. మెగా టోర్నీ నుంచి వైదొలిగేంత దమ్ము, ధైర్యం ఆ దేశ బోర్డుకు లేవు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారావ్వడంతో పాటు ఒప్పందం ప్రకారం ఆ జట్టు మ్యాచులన్నీ శ్రీలంకలోనే ఉన్నాయి. సో.. బాయ్‌కాట్‌కు సిద్దపడుతుందని నేను భావించను. అన్ని జట్లలానే పాక్ కూడా వరల్డ్‌కప్ కోసం వస్తుంది’ అని పేర్కొన్నాడు. ఒకప్పుడు టీమిండియాలో కీలక ఆటగాడైన రహానే ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో, ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
Pakistan Served Brutal Reality Check Over T20 World Cup Drama By Ajinkya Rahane: “Don’t Have The Guts”https://t.co/8Cl6suFPU1 pic.twitter.com/4ZqIL6MNzn
— CricketNDTV (@CricketNDTV) January 29, 2026
భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. భద్రతా కారణాలరీత్యా ఇండియాలో ఆడబోమని బెట్టు చేసిన బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ గ్రూప్ -సీలో స్కాంట్లాండ్‌కు చోటు కల్పించింది. బంగ్లాపై వేటు పడడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మా జట్టు సైతం ప్రపంచకప్ ఆడుతోందో లేదో తెలియదు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే మేము ఆడుతాం అని కామెంట్ చేశాడ. ఆ మరునాడే పాక్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. దాంతో, మెగా టోర్నీలో పాక్ ఆడడం పక్కా అనిపిస్తోంది. కానీ, తాము వరల్డ్‌కప్‌లో ఆడుతామా? లేదా? అనే విషయాన్ని జనవరి 30న లేదా ఫిబ్రవరి 2న వెల్లడిస్తామని నఖ్వీ పేర్కొన్నాడు.
Harsha Bhogle and Ajinkya Rahane mocking Pakistan 🤣
Rahane – Pakistan can’t boycott T20 World Cup
Harsha – It’s not any inter club game that whenever they can say we will not play or will play, If they don’t want to play then no one will force them
pic.twitter.com/h14SQrYv1o— Tejash (@Tejashyyyyy) January 29, 2026
భారత్, పాక్ క్రికెట్ బోర్డుల మధ్య సఖ్యత లేనందున ఇరుజట్ల మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహిస్తున్నారు. ఈసారి వరల్డ్‌కప్‌లోనూ పాకిస్థాన్ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే ఆడనుంది. డిసెంబర్ 2024లో పీసీబీ, బీసీసీఐ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కొలంబో, పల్లెకెలె స్టేడియాల్లో పాక్ జట్టు మ్యాచ్‌లు ఉంటాయి. గ్రూప్ ఏలో ఉన్న చిరకాల ప్రత్యర్థులు జనవరి 15న కొలంబోలో ఢీకొననున్నాయి. నిరుడు ఆసియా కప్ ఫైనల్ తర్వాత దాయాదుల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే.