England Tour : భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలోనే వన్డే, టీ20ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ పర్యటన (England Tour)కు వెళ్లనుంది. రెండు ఫార్మట్ల సిరీస్‌లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది హర్మన్‌ప్రీత్ కౌర్ సేన. అందుకే గురువారం మహిళా సెలెక్షన్ కమిటీ పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. గాయపడిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షుచీ ఉపాధ్యాయ్ స్థానాన్ని రాధా యాదవ్ (Radha Yadav) భర్తీ చేయనుందని తెలిపారు సెలెక్టర్లు. స్పిన్ ఆల్‌రౌండర్, మ్యాచ్ విన్నర్ అయిన రాధ చేరికతో స్క్వాడ్ మరింత బలోపేతంగా మారింది. ఈ విషయాన్ని గురువారం బీసీసీఐ వెల్లడించింది.
‘స్పిన్నర్ షుశీ గాయంతో ఇంగ్లండ్ పర్యటనకు దూరమైంది. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో బీసీసీఐ నిర్వహించిన ప్రీ- క్యాంప్‌లో ఆమె షిన్ బోన్ గాయంతో బాధపడింది. దాంతో ఆమె స్థానంలో రాధా యాదవ్‌ను మహిళా సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్ జట్టుతో 5 టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
🚨 NEWS 🚨
Radha Yadav named as replacement for injured Shuchi Upadhyay in #TeamIndia’s squads for the England tour.
Details 🔽 #ENGvINDhttps://t.co/4p36zNga3M
— BCCI Women (@BCCIWomen) June 12, 2025
వన్డే స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, అమన్‌జోత్ కౌర్, అరుంధతీ రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే, రాధా యాదవ్.
షుచీ ఉపాధ్యాయ్
టీ20 స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, అమన్‌జోత్ కౌర్, అరుంధతీ రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే, రాధా యాదవ్.
ఇరుజట్ల మధ్య జూన్ 28న నాటింగ్హమ్ వేదికగా జరిగే టీ20 మ్యాచ్‌తో సిరీస్ ఆరంభం కానుంది. జూలై 1న రెండో టీ20, ఓవల్ మైదానంలో జూలై 4న మూడో మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్‌లో జూలై 9న నాలుగో టీ20, జూలై 12న బర్మింగ్హమ్లో ఐదో మ్యాచ్‌తో పొట్టి సిరీస్ ముగుస్తుంది. అనంతరం జూలై 16, 19, 22న ఇరుజట్లు వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి.