Rachin Ravindra : న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra)కు క్రికెట్ రికార్డులను తన పేర రాసుకుంటూ వస్తున్నాడు. నిరుడు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచిన ఈ చిచ్చరపిడుగు తాజాగా మరో అవార్డు అందుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మక ‘రిచర్డ్ హ్యాడ్లీ'(Richard Hadlee) పురస్కారం రచిన్‌ను వరించింది.
తన సంచలన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ భావి తారగా ప్రశంసలందుకుంటున్న రవీంద్ర 24 ఏండ్ల వయసులోనే ఈ అవార్డు గెలవడం విశేషం. తద్వారా దాంతో, చిన్నవయసులోనే ఈ అవార్డు గెలిచిన క్రికెటర్‌గా ఈ యంగ్‌స్టర్ చరిత్ర సృష్టించాడు. మహిళల విభాగంలో అమేలియా కేర్(Amelia Kerr) డెబ్బీ హాక్లే మెడల్ గెలుచుకుంది. అంతేకాదు డ్రీమ్ 11 సూపర్ స్మాష్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డరూ ఆమె ఎగరేసుకుపోయింది.
Our youngest ever Sir Richard Hadlee Medalist! Full #ANZNZCAwards Summary | https://t.co/PTpJF5quof pic.twitter.com/drlbyg6wlC
— BLACKCAPS (@BLACKCAPS) March 13, 2024
స్వదేశంలో రికార్డు సెంచరీలు బాదిన కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్కు ‘రెడ్‌పాత్ కప్'(Red Path Cup) అవార్డు దక్కగా.. ఆస్ట్రేలియా సిరీస్‌లో అదరగొట్టిన పేసర్ మ్యాట్ హెన్రీ ది ‘విన్సర్ కప్’ అవార్దును అందుకున్నాడు. ఆరంగేట్రం వరల్డ్ కప్‌లో రచిన్ రవీంద్ర రికార్డులు బద్దలు కొట్టాడు.
The winner of the Redpath Cup is Kane Williamson! He led with the bat with 4 hundreds – 2 of them coming in one Test against South Africa at Bay Oval. He also became just the 5th New Zealander to score hundreds in both innings of a test. #ANZNZCAwards pic.twitter.com/yGJMb9r7RJ
— BLACKCAPS (@BLACKCAPS) March 13, 2024
వన్డే ప్రపంచ కప్‌లో 5 సార్లు 50ప్లస్ స్కోర్ చేసిన మూడో కివీ బ్యాటర్‌గా రచిన్ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు రెండు సెంచరీతో చెలరేగిన ఈ యంగ్‌స్టర్ న్యూజిలాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అనంతరం సొంతగడ్డపై రచిన్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.
The youngest ever winner of the Sir Richard Hadlee Medal, Rachin Ravindra!
Capping off a stellar season for the BLACKCAPS featuring 3 World Cup hundreds, the ICC Men’s Emerging Player of the Year Award, and the highest ever maiden test hundred for a New Zealander. #ANZNZCAwards pic.twitter.com/42Zcdo4gpc
— BLACKCAPS (@BLACKCAPS) March 13, 2024
దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రవీంద్ర ద్విశతకం బాదాడు. కెరీర్లో తొలి టెస్టు సెంచరీనే ద్విశతకంగా మలిచిన రెండో కివీస్ బ్యాటర్‌గా రవీంద్ర రికార్డు నెలకొల్పాడు. రవీంద్ర కంటే ముందు డెవాన్ కాన్వే(Devan Conway) ఈ ఫీట్ సాధించాడు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో కాన్వే 200 రన్స్ కొట్టాడు. వరల్డ్ కప్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన రవీంద్ర ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. 17వ సీజన్ మినీ వేలంలో ఈ చిచ్చరపిడుగును చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.8 కోట్లకు కొన్నది.