Life Style | మీ జతగాడు సరైనోడా.. కాదా.. తెలుసుకోండిలా!
ప్రేమ పండాలన్నా, జీవన యానంలో అనురాగాలు పల్లవించాలన్నా జతగాడు సరైనోడా, కాదా అని కనిపెట్టగలగాలి. పైపై పలకరింపులకే ఫిదా అయిపోతే పొరబడినట్టే! మాటతీరు, ప్రవర్తన, కంటిచూపును బట్టి కూడా అతగాడు ఎలాంటి వాడో అంచనాకు రాగలగాలి. మీకు తారసపడిన వ్యక్తిలో కింద పేర్కొన్న లక్షణాలు ఉంటే.. ఆ పరిచయాన్ని కొనసాగించడానికి ముందు ఒకసారి ఆలోచించండి!
Life Style | ప్రేమ పండాలన్నా, జీవన యానంలో అనురాగాలు పల్లవించాలన్నా జతగాడు సరైనోడా, కాదా అని కనిపెట్టగలగాలి. పైపై పలకరింపులకే ఫిదా అయిపోతే పొరబడినట్టే! మాటతీరు, ప్రవర్తన, కంటిచూపును బట్టి కూడా అతగాడు ఎలాంటి వాడో అంచనాకు రాగలగాలి. మీకు తారసపడిన వ్యక్తిలో కింద పేర్కొన్న లక్షణాలు ఉంటే.. ఆ పరిచయాన్ని కొనసాగించడానికి ముందు ఒకసారి ఆలోచించండి!
పెత్తనం చేస్తుంటే..
డేటింగ్లో అయినా, ప్రేమలో అయినా.. ఆప్యాయత రంగరించి మాట్లాడుతుంటారు. కానీ, రోజులు గడిచే కొద్దీ అజమాయిషీ చేస్తుంటారు. ప్రేమ ఉన్న చోట పెత్తనానికి తావులేదు. తన మాటే నెగ్గాలనే వైఖరి ఉన్నవాళ్లు.. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించరు. మీ చెలికాడు అలాంటివాడైతే ఆ వైఖరి మార్చుకోమని చెప్పండి. అయినా ధోరణి మార్చుకోకపోతే.. ఆ పరిచయాన్ని మొగ్గలోనే తుంచేయండి.
మిస్టర్ పర్ఫెక్ట్ వద్దు..
తనొక్కడే మిస్టర్ పర్ఫెక్ట్ అనే భావనలో ఉంటారు కొందరు. ఆ పర్ఫెక్షనిజం మొదట్లో నచ్చినా.. తర్వాతి కాలంలో మోయలేని భారంగా మారుతుంది. తను పర్ఫెక్ట్ అనుకుంటే తప్పులేదు. ఎదుటివారి తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకుంటే జీవితం చికాకుగా మారుతుంది. ఉదాహరణలతో ఉపదేశాలిచ్చే వ్యక్తులతో సంతోషంగా జీవించలేరని గుర్తుంచుకోండి.
స్వార్థచిత్తులకు చెక్..
పైకి ఆప్యాయంగా మాట్లాడుతున్నా.. లోలోపల ఏవో ఆలోచనలు చేస్తుంటారు కొందరు. లాభనష్టాలు బేరీజు వేసుకుంటూ ఉంటారు. ఎంతసేపూ వారి స్వార్థమే చూసుకుంటారు. నిశితంగా పరిశీలిస్తే ఇలాంటి వారిని కనిపెట్టడం అంత కష్టమేమీ కాదు. ఆర్థిక విషయాల్లోనో, మరేదో సందర్భంలోనో.. అలవాటులో పొరపాటు చేసి దొరికిపోతారు. ఈ తరహా స్వార్థపరులను జీవితాంతం భరిస్తూ బాధపడటం కన్నా.. ఒక్కక్షణం గుండె రాయి చేసుకొని శాశ్వతంగా దూరం పెట్టడం ఉత్తమం.
నిరాశావాదులొద్దు
నిరాశకు, దురదృష్టానికి తమను తాము చిరునామాగా భావించేవాళ్లు కొందరు ఉంటారు. అలాంటి వారు తారసపడితే.. వీలైనంత దూరం పెట్టండి. ఎంతసేపూ ఇతరులతో కంపేర్ చేసుకుంటూ కాలయాపన చేస్తుంటారు తప్ప.. జీవితంలో ఎలా ఎదగాలో ఆలోచించరు! ఇలాంటివారితో నెయ్యం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

