Paris Olympics 2024 : విశ్వ క్రీడల్లో భారత క్వార్టర్ మిలర్ కిరణ్ పహల్ (Kiran Pahal) నిరాశ పరిచింది. 400 మీటర్ల రెపెచేజ్ రౌండ్లో సెమీఫైనల్ చేరలేకపోయింది. మంగళవారం జరిగిన పోటీల్లో కిరణ్ ఆరో స్థానంతో సెమీ ఫైనల్ బెర్తు కోల్పోయింది. హీట్ 1లో 52.59 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. దాంతో, ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలనుకున్న ఆమె కల చెదిరింది.
హర్యానాకు చెందిన కిరణ్ విశ్వ క్రీడల 400 మీటర్ల రేసులో చరిత్ర సృష్టించింది. 50.92 సెకన్లలో రేసు పూర్తి చేసి అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కనబరిచింది. దాంతో, 400 మీటర్ల పరుగను వేగవంతంగా పూర్తి చేసిన రెండో భారత మహిళ అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. హిమా దాస్ (Hima Das) 50.79 సెకన్లతో అగ్రస్థానంలో ఉంది.