Vinesh Phogat : ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) తొలి మెడల్‌కు చేరువైంది. 50 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసింది. మంగళవారం 16వ రౌండ్లో ‘దంగల్'(Dangal) సినిమా తరహాలో చెలరేగిన వినేశ్.. వరల్డ్ నంబర్ 1 కు చెక్ పెట్టింది. అనంతరం ఆమె భావోద్వేగానికి లోనైంది. మ్యాట్ మీదే కూలబడి సంతోషం పట్టలేక కన్నీళ్లు పెట్టకుంది. ఆ విజయం ఎంత గొప్పతో ఆమెకు బాగా తెలుసు.
ఎందుకంటే.. ఏడాది క్రితం సొంతగడ్డపై వీధుల్లో పోరాటం చేసిన ఆమె ఒక దశలో ఒలింపిక్స్ ఆడేందుకు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంది. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) వర్గం అడుగడుగునా అడ్డు పడినా మొక్కవోని సంకల్పంతో లక్ష్యంవైపు కదిలింది. ఇప్పుడు విశ్వవేదికపై తన ఉడుంపట్టుతో దేశ ఖ్యాతిని, గౌరవాన్ని పెంచుతోంది. దాంతో, యావత్ భారతం ఆమె ప్రతిభకు సలాం కొడుతోంది.
Olympic champion Yui SUSAKI 🇯🇵 was 82-0 in international matches
Then Vinesh PHOGAT 🇮🇳 happened at #Paris2024pic.twitter.com/BYtiFj1v9k
— United World Wrestling (@wrestling) August 6, 2024
పారిస్ ఒలింపిక్స్‌లో మ్యాట్‌పై ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న వినేశ్ ఫోగట్ ఏడాది క్రితం ఊహించని పరిస్థితులు ఎదుర్కొంది. మహిళా రెజ్లర్ల తరఫున న్యాయం కోసం పోరాడిన ఆమెను పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఈ డాటర్ ఆఫ్ ఇండియా కన్నీళ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఆమె ఇప్పుడు దేశ గౌరవాన్ని పెంచేందుకు విశ్వ వేదికపై యోధురాలిలా పోరాడుతోంది. దాంతో, నెటిజన్లు వినేశ్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
देश की बेटी जिसे कुछ समय पहले भारत सरकार ने खून के आंसू रुलाए थे, आज वो पेरिस ओलम्पिक में देश का नाम बुलंद कर रही है।
Thank you Vinesh Phogat for making India proud 🇮🇳❤️#VineshPhogat #ParisOlympics2024 #ParisOlympics pic.twitter.com/0OKfgOAE6O
— Priyanshu Kumar (@priyanshu__63) August 6, 2024
మహిళల రెజ్లింగ్‌లో వినేశ్ భారత ఆశాకిరణంలా దూసుకొచ్చింది. వరల్డ్ చాంపియన్‌షిప్స్(2019, 2022)లో ఆమె 53 కిలోల విభాగంలో కాంస్య పతకంతో మెరిసింది. అంతేకాదు 2018 ఆసియా క్రీడల్లో 50 కిలోల విభాగంలో పోటీపడిన ఆమె ఏకంగా స్వర్ణ పతకం కొల్లగొట్టింది. అయితే.. మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న అప్పటి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)కు వ్యతిరేకంగా వినేశ్ ఫోగట్ పెద్ద ఉద్యమమే చేసింది. అతడిని పదవి నుంచి తప్పించడతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని తోటి రెజ్లర్లు భజ్రంగ్ పూనియా, సాక్షి మాలికలతో ఫోగట్ ఉద్యమించిన విషయం తెలిసిందే.
Never Forget, Never Forgive
More power to Vinesh Phogat 🇮🇳 pic.twitter.com/1yEvlENpub
— Ankit Mayank (@mr_mayank) August 6, 2024