POCO | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 ప్లస్ 5జీ (Poco M6 Plus 5G) ఫోన్, బడ్స్ ఎక్స్1 లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. పోకో ఎం6 5జీ నుంచి అప్ గ్రేడ్ చేసిన ఫోన్ పోకో ఎం6 ప్లస్ ఫోన్ స్లీక్ గ్లాస్ డిజైన్ విత్ రింగ్ ఫ్లాష్, 108 మెగా పిక్సెల్ కెమెరా విత్ 3ఎక్స్ ఇన్ సెన్సార్ జూమ్‌తో వచ్చింది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంటుంది. డ్యుయల్ గ్లాస్ డిజైన్ తోపాటు బ్లెండ్ ఆఫర్ పవర్ అండ్ ఎలిగెన్స్ డెలివరీ చేస్తామని చెబుతోంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.79 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటుంది.
ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్, గ్రాఫైట్ బ్లాక్ వంటి రంగుల్లో వస్తున్న పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్ ఈ నెల ఐదో తేదీ నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటది. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,999, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,499 పలుకుతుంది.
పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ ప్రాసెసర్ తో పని చేస్తుంది. 2.3 గిగా హెర్ట్జ్ స్పీడ్ తో ఇంప్రెస్సివ్ పెర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తోంది. స్మూత్ మల్టీ టాస్కింగ్ సామర్థ్యం దీని స్పెషాలిటీ. 108 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరాతోపాటు 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5030 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.
పోకో ఆవిష్కరించిన బడ్స్ ఎక్స్1 40డీబీ హైబ్రీడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫర్ చేస్తోంది. టైలర్డ్ లిజనింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం కస్టమిజబుల్ ఆడియో సెట్టింగ్స్ ఉంటాయి. తక్కువ ధరకు ఐటీ నిపుణలకు అందుబాటులో ఉన్న హై పెర్ఫార్మెన్స్ ఇయర్ బడ్స్ ఇవి. హై క్వాలిటీ కంట్రోల్ విత్ 12.4 ఎంఎం డైనమిక్ టైటానియం డ్రైవర్స్, ఎఫెక్టివ్ నాయిస్ క్యాన్సిలేసన్, 36 గంటల పూర్తి ప్లే టైం వరకూ లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. బ్లూటూత్ 5.3, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ అందుకున్నది.
Citroen Basalt | సిట్రోన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్.. !
Hyundai Venue | హ్యుండాయ్ వెన్యూ అప్ డేటెడ్ వర్షన్ వెన్యూ ఎస్ (ఓ)+.. ధరెంతంటే..?!
World Bank – India | ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు.. భారత్ ఆ స్థాయికి చేరుకోవాలంటే..!