ఒర్లీన్స్: ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో భారత యువ షట్లర్ తన్విశర్మ ముందంజ వేసింది. పోటీల రెండో రోజైన గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో తన్వి 21-14, 21-17తో భారత్‌కే చెందిన అన్మోల్ కర్బ్‌పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్ రజత విజేత వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తుచేసింది.
మెరుపు స్మాష్‌లకు తోడు నెట్‌గేమ్, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో హరిహరణ్ అమ్సకరుణన్, ఎమ్ఆర్ అర్జున్ ద్వయం 26-24, 21-4తో అలెగ్జాండర్ డున్, ఆడమ్ ప్రింగ్లె జోడీపై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.