చెన్నై: ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే) లీగ్‌కు ముందే ఎదురుదెబ్బ తగిలింది. కండరాల గాయంతో ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎలీస్ లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని లీగ్ వర్గాలు ఒక ప్రకటనలో అధికారికంగా ధృవీకరించాయి. శ్రీలంక స్టార్ పేసర్ మతీశ పతిరన..కోల్‌కతా నైట్‌రైడర్స్ మారిన నేపథ్యంలో పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తాడనుకున్న ఎలీస్ కూడా గాయంతో నిష్క్రమించాడు.
అయితే ఎలీస్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీఎస్కే పేర్కొంది. ఇప్పటి వరకు 17 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసిన ఎలీస్ను గత వేలంలో సీఎస్కే రూ.2 కోట్లకు తీసుకుంది.