ఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీడబ్ల్యూఎఫ్) మిగతా సీజన్‌కు దూరమైంది. కాలి గాయం కారణంగా ఆమె యూరప్ వేదికగా జరుగబోయే మిగిలిన సీజన్ నుంచి వైదొలుగుతున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ స్పోర్ట్స్ ఆర్థోపెడిస్ట్ డాక్టర్ దిన్షా పార్ధివాలా సూచన మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.
‘కాలిగాయం నుంచి నేనింకా పూర్తిగా కోలుకోలేదు. క్రీడాకారుల జీవితంలో గాయాలు ఒక భాగం. డాక్టర్ దినేశ్ పార్ధివాలా సూచన అనంతరం ఈ సీజన్ బీడబ్ల్యూఎఫ్ టోర్నీల నుంచి వైదొలగడమే మంచిదని నిశ్చయించుకున్నాను’ అని పేర్కొంది.