కౌలాలంపూర్ : మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, కరుణాకరన్, ఆయుష్ శెట్టి రెండో రౌండ్‌కు ముందుంజ వేయగా.. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక బన్సోద్, ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. ప్రణయ్ 19-21, 21-17, 21-16తో నిషిమొటో(జపాన్)పై పోరాడి గెలిచాడు.
కరుణాకరన్ 21-13, 21-14తో చౌ టైన్ చెన్ (చైనీస్ తైపీ)ను చిత్తు చేశాడు. ఆయుష్ 20-22, 21-10, 21-8తో బ్రియాన్ యంగ్ (కెనడా)ను ఓడించాడు. శ్రీకాంత్ 23-21, 21-13, 21-11తో ఆరో సీడ్ లు గువాంగ్ జు (చైనా)కు షాకిచ్చాడు. కానీ ప్రియాన్షు రజావత్ 21-15, 21-17తో జేసన్ (సింగపూర్) చేతిలో ఓడాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ 21-18, 15-21, 21-14తో మౌలానా-జమిల్ (ఇండోనేషియా)ను ఓడిం చి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.