ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత బృందం క్యాంపెయిన్ ముగిసింది. చో టై చెన్ చేతిలో లక్ష్యసేన్ ఓటమి పాలవగా.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా ఓటమి చవి చూసింది. దీంతో ఇండోనేషియా మాస్టర్స్‌లో భారత పోరాటం ముగిసింది.
ఐదో సీడ్ రాచనోక్ ఇంటానన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు ఘోరంగా ఓడిపోయింది. వుమెన్ సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ చేరిన సింధు.. కేవలం 33 నిమిషాల్లోనే వరుస సెట్లు ఓడిపోవడంతో విజయం ఇంటనాన్ వశమైంది.
థాయ్‌ల్యాండ్ ప్లేయర్ ఇంటనాన్ చేతిలో సిందుకు ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కూడా 12-21, 10-21 తేడాతో సింధు ఓడిపోయింది. ఇప్పటి వరకు వీళ్లిద్దరూ ముఖాముఖి పోరాడిన మ్యాచుల్లో సింధు నాలుగు విజయాలు సాధించగా.. ఇంటనాన్ 9 విజయాలు సాధించింది..