US Open : యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు(Indian Shuttlers) జోరు కొనసాగిస్తున్నారు. ఈమధ్యే కెనడా ఓపెన్(Canada Open 2023) చాంపియన్‌గా నిలిచిన లక్ష్యసేన్(Lakshya Sen) పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్‌లో అదరగొడుతున్న పీవీ సింధు(PV Sindhu) కూడా క్వార్టర్స్‌కు చేరింది.
సూపర్ ఫామ్‌లో ఉన్న లక్ష్యసేన్ చెక్ రిపబ్లిక్ ఆటగాడు జాన్ లొడా(Jan Louda)పై 21-8, 23-21తో గెలుపొందాడు. లక్ష్యసేన్ సెమీస్ బెర్తు కోసం భారత్‌కు చెందిన 19 ఏళ్ల ఎస్ శంకర్ ముత్తుస్వామి(S Sankar Muthusamy)ని రేపు ఢీ కొట్టనున్నాడు.
ఎస్ శంకర్ ముత్తుస్వామి
ఈ సీజన్లో ఒక్క ట్రోఫీ నెగ్గని ఒలింపిక్ విజేత సింధు పతకంపై ఆశలు రేపుతోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆమె తైవాన్‌కు చెందిన సంగ్ షువో యున్‌పై అలవోకగా గెలుపొందింది. వరుసగా రెండు సెట్లలో ఆధిపత్యం చెలాయించిన భారత షట్లర్ 21-14, 21-12తో సంగ్ షువోను చిత్తుగా ఓడించింది. సింధు క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి గావో ఫాంగ్ జీతో తలపడనుంది. కెనడా ఓపెన్‌లో క్వార్టర్స్‌లోనే ఇంటి దారి పట్టిన సింధు ఈసారి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది.