జకార్తా: భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు వరుసగా పదోసారి ప్రపంచ నంబర్ వన్, సౌత్ కొరియా స్టార్ అన్ సే యంగ్ చేతిలో ఓడి ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు 17-21, 14-21 తేడాతో అన్సె యంగ్ చేతిలో వరుస గేమ్స్‌లో చిత్తయింది.
పురుషుల సింగిల్స్ లో ఆయుష్ శెట్టి 21-16, 13-21, 14-21తో లీ చుక్ యూ (హాంకాంగ్) చేతిలో పోరాడి ఓడాడు. కాగా, డబుల్స్‌లో హరిహరన్ – అర్జున్ ద్వయం 16-21, 21-15, 21-19 తో ఆరోన్ తాయ్-కాంగ్ జింగ్ (మలేషియా) ద్వయంపై అద్భుత విజయం సాధించి క్వార్టర్స్ చేరింది. కానీ, మిక్స్‌డ్‌లో రుత్విక- రోహన్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది.